You might be interested in:
Sponsored Links
పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మైన మేము, మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్ప కుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియచేస్తున్నాము.
పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని, అంకితభావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము పాఠశాలకు, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము,
పిల్లల బంగారు భవిత కోసం, వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తాము.
పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ, నవసమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము.
0 comment