ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు

You might be interested in:

Sponsored Links

29.11.24 న విజయవాడలో విద్యా భవన్ నందు  పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి శ్రీ కోన శశిధర్, పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ విజయరామరాజు, సమగ్ర శిక్ష ఎస్ పి డి శ్రీ శ్రీనివాసరావు గార్లతో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం లో వివిధ సమస్యలపై చర్చించిన వెధంశాలు

ఈ సమావేశంలో ముఖ్య అంశాలు: 

- యాప్స్ యొక్క భారాన్ని తగ్గించి ప్రస్తుతం ఉన్న 45 యాప్ లను లేకుండా కేవలం ఒకటి రెండింటికి సరిచేస్తామన్నారు*. 

- మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ IV ఏర్పాటు చేశామని తెలిపారు.

- సోషల్ మీడియాలో ఉపాధ్యాయులు పోస్టింగులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. నేను పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 

- పాఠశాల పని వేళలు పైలెట్ ప్రాజెక్టుగా 9 నుంచి 5 వరకు ఈ నెల 30 వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

- డీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలాఖరు లోపల విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

- బైలింగ్వల్ టెస్ట్ బుక్స్ ను కంటిన్యూ చేస్తామన్నారు. 

- జీవో 117 రద్దుచేసి నూతన ప్రతిపాదనలతో డ్రాప్ట్ జీవో విడుదల చేస్తామన్నారు.

- ఇకపై ఐదు రకాలు 

- 1. సాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పిపి1 పిపి2) 

- 2. ఫౌండేషన్ స్కూల్స్ (పిపి 1 పి పి 2 క్లాస్ 1, 2)

- 3.బేసిక్ ప్రైమరీ స్కూల్స్

- 4. మోడల్ ప్రైమరీ స్కూల్స్

- హై స్కూల్స్ (6 నుండి10)

- హై స్కూల్ ప్లస్ లను కొనసాగించేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. వీలైతే హై స్కూల్ ప్లస్ లను ఇంటర్మీడియట్ బోర్డు కు అప్పగించేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు.

- ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8 తరగతులు విద్యార్థులు 60 పైన ఉంటే హై స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.

- 60 లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఐదు ఐదు కిలోమీటర్ల లోపు హై స్కూల్ లేనట్లయితేనే కొనసాగిస్తామన్నారు. 

- హై స్కూల్లో 75 మంది విద్యార్థులు ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలకు హెడ్మాస్టర్ మరియు పిడి పోస్ట్ కేటాయిస్తామన్నారు. 

- హైస్కూల్లో  ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40 గా రెండో సెక్షన్ 53 తర్వాత, మూడో సెక్షన్ 93 తర్వాత, నాలుగో సెక్షన్ 133 తర్వాత అనగా ప్రతి 40 మందికి ఒక్కో సెక్షన్ ఇస్తారు. 

- ఉపాధ్యాయుల సరాసరి పని భారం 38 పీరియడ్లుగా తీసుకొని ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 

- ఉపాధ్యాయ బదిలీల కోడ్ పై కూడా మరొకసారి చర్చించడం జరిగింది. 

- మే 31 కట్ ఆఫ్ తేదీ గా జూలై 1న ట్రాన్స్ఫర్ ఆర్డర్  ఇచ్చేటట్లుగా చూస్తారు. 

- రేషన్లైజేషన్లో సర్వీసులో జూనియర్ ను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. 

- ప్రమోషన్లు మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే ఇస్తారు. 

- 16% హెచ్ఆర్ఏ ప్రాంతాలను కేటగిరి 1 గా ఒక పాయింట్, 12% హెచ్ఆర్ఏ ప్రాంతాలను కేటగిరి 2 గా రెండు పాయింట్లు, 10% హెచ్ ఆర్ ఏ ప్రాంతాలను రెండు విభాగాలుగా వెయ్యి జనాభా ప్రాతిపదికన విభజించాలని సూచించగా ఈ విషయమై సంఘాలు విభేదించడంతో మరొకసారి చర్చిస్తామన్నారు .

- సర్వీస్ పాయింట్ ఒక్కో సంవత్సరానికి ఒక పాయింట్ ఇస్తారు.

- స్పెషల్ పాయింట్లు-  అవివాహత మహిళా ఉపాధ్యాయులు 40 సంవత్సరాల పైబడితే, వికలాంగులు 40 నుంచి 69% లోపల ఉంటే ఐదు పాయింట్లు ఇస్తారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలు గత జీవోలో మాదిరిగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. 

- పదవి విరమణ రెండు సంవత్సరాల్లోపు ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయిస్తారు. 

- విజువల్ హ్యాండీక్యాప్డ్ 100% ఆర్థోపెటికల్ హ్యాండీక్యాప్డ్ 80% ఉన్నవారికి మినహాయింపు ఇస్తారు..

- ఇక మీదట రిఫరెన్షియల్ క్యాటగిరిలో బదిలీల్లో ఉన్నవారికి ప్రాథమిక పాఠశాల అయితే 40% మందికి అనగా 5 మంది ఉపాధ్యాయులు ఉంటే ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 50 శాతం అనగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరికి మాత్రం అవకాశం ఇస్తారు

-  రెసిడెన్షియల్ ట్రైనింగ్ లలో విల్లింగ్ ఉన్న వారు మాత్రమే బస చేయవచ్చు. విల్లింగ్ లేని వారు బస చేయాల్సిన అవసరం లేదు. అయితే మూడుసార్లు బయోమెట్రిక్ వేయిస్టారు.

- ఉపాధ్యాయుల సెలవుల విషయంలో హై స్కూల్స్లో మాత్రమే 10 శాతం ఉపయోగించుకోవాలనే నిబంధన ఉంటుందని, ప్రాథమిక పాఠశాలలకు వర్తించదని తెలిపారు. 

ఇంకా అనేక విషయాలపై సానుకూలంగా చర్చలు జరిగాయి. అన్ని సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి కూడా ఆలోచించాలన్నారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE