EdCIL Counsellors: ఏపీ విద్యాశాఖలో మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌.. 255పోస్టుల భర్తీ. - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

EdCIL Counsellors: ఏపీ విద్యాశాఖలో మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌.. 255పోస్టుల భర్తీ.

You might be interested in:

Sponsored Links

EdCIL Counsellors: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవరత్న కంపెనీలలో ఒకటైన ఎడ్‌సిల్‌(EdCIL)లిమిటెడ్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఎడ్‌సిల్‌ ఏర్పాటైన పదేళ్ళలోనే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక లాభదాయక సంస్థగా అవతరించింది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్సల్టెన్సీ, ఎడ్‌టెక్‌ తదితర సేవల్ని ఎడ్‌సిల్ అందిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఎడ్‌ సిల్‌ సేవలు అందసి్తోంది. గత దశాబ్ద కాలంలో 24శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఎడ్‌ సిల్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో కెరీర్‌ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 26 జిల్లాల్లో మొత్తం 255 మంది కౌన్సిలర్లను నియమిస్తారు. దీంతో పాటు పిఎంయు సభ్యులు, కో ఆర్డినేటర్లుగా ఇద్దరిని నియమిస్తారు. భారత పౌరులై తెలుగులో మాట్లాడటం, రాయడంతో పాటు భాషపై పట్టున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కెరీర్ అండ్ మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్లు...

ఈ నోటిపికేషన్‌ ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని 26జిల్లాల్లో 255మంది మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఏ సైకాలజీ, బ్యాచిలర్ డిగ్రీలో సైకాలజీ పూర్తి చేసి ఉండాలి.దీంతో పాటు కెరీర్ గైడెన్స్‌ అండ్ కౌన్సిలింగ్‌లో డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కౌన్సిలింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. గరిష్టంగా 35ఏళ్ల లోపు వయసు ఉండాలి.

దరఖాస్తు చేసే అభ్యర్థులు విద్యార్థులకు ముఖాముఖి కౌన్సిలింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. కెరీర్ గైడెన్స్‌తో పాటు విద్యార్ధుల ఆసక్తికి అనుగుణంగా కోర్సులను వివరించడం, వారిలో మానసిక స్థ్యైర్యాన్ని పెంపొందించే నైపుణ్యం కలిగి ఉండాలి. పేరెంట్స్‌, టీచర్స్‌తో కలిసి కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. విద్యార్థులు, విద్యా సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో కలిసి విద్యార్థుల కెరీర్‌ డెవలప్‌మెంట్‌ కోసం పనిచేయాల్సి ఉంటుంది.

విద్యార్థులకు మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడటం వంటి అంశాలపై కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్‌పై అవగాహనపై వర్క్‌షాప్‌ల నిర్వహణ, విద్యార్థులను ఉత్తేజం నింపడం, భావోద్వేగాలను అదుపు చేయడం వంటి అంశాలపై శిక్షణ కల్పించాల్సి ఉంటుంది.

పిఎంయూ మెంబర్స్‌, కోఆర్డినేటర్లు దరఖాస్తు చేసేవారు ఎమ్మెస్సీ సైకాలజీ ఎం‎ఫిల్ సైకాలజీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. సైకియాట్రిక్ సోషల్ వర్క్‌ గైడెన్స్‌, కౌన్సిలింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పోస్టులను విజయవాడ కేంద్రంగా భర్తీ చేస్తారు. గరిష్టంగడా 45ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసే వారికి ఖచ్చితంగా తెలుగులో పట్టు ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు చేయడం ఎలా...

ఆన్‌లైన్‌ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏపీ సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ అమోదించిన మేరకు 26జిల్లాల్లో నియామకాలు చేపడతారు. అర్హతలు, అనుభవాలు సెప్టెంబర్ 30, 2024కు కలిగి ఉండాలి.

నియామక ప్రక్రియ ఇలా...

దరఖాస్తు చేసిన అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమిక ఎంపికలు చేస్తారు. వ్రాత పరీక్ష నిర్విస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో నెగ్గాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా ఉద్యోగంలో చేరకపోతే వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారిని నియమిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ తమ విద్యార్హతు, అనుభవం, ఫోటో, రెజ్యుమ్‌లను పిడిఎఫ్‌ ఫార్మాట్‌లోఅప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఈ మెయిల్‌, ఫోన్‌ నంబర్లను అప్లికేషన్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్ల నియామకం కాంట్రాక్టు పద్ధతిలో చేపడతారు. ప్రాథిమకంగా 2025 ఏప్రిల్ 30 వరకు నియమిస్తారు. దానిని2025 జులై

నుంచి 2026 ఏప్రిల్ వరకు పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష ప్రాజెక్టు అవసరాల మేరకు ఈ నియామకాలు చేపడతారు.

మెంటల్ హెల్త్‌ కౌన్సిలర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE