Education Department and Unions రాష్ట్ర విద్యాశాఖ - ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలలో చర్చించిన అంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Education Department and Unions రాష్ట్ర విద్యాశాఖ - ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలలో చర్చించిన అంశాలు

You might be interested in:

Sponsored Links

రాష్ట్ర విద్యాశాఖ జిఓ 117 రద్దు, బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన వివిధ అంశములపై ప్రతి శుక్రవారం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలుగా జరుగుతున్న చర్చలకు సంబంధించి కొన్ని అంశములపై స్పష్టత వచ్చింది.

(1) జిఓ 117 రద్దుకు సంబంధించి: జిఓ ఎంఎస్ నం. 84 తేదీ. 24.12.2021ననుసరించి గత ప్రభుత్వం మూడంచెల విద్యా వ్యవస్థను 6 రకాల పాఠశాలల వ్యవస్థగా మార్చింది. తదుపరి ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 1 కి.మీ. దూరంలో గల సమీప యుపి, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల 4,731 ప్రాథమిక పాఠశాలలు, 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనమయ్యాయి. 2,43,540మంది విద్యార్ధులను తరలించారు. 3వ తరగతి నుండి స్కూల్ అసిస్టెంట్లతో విద్యా బోధన జరిపేందుకు 7,961 ఎసీటి పోస్టులను అప్గ్రేడ్ చేసారు. జిఓ 117 మరియు 128 ఉత్తర్వులు ఇచ్చి ఉపాధ్యాయుల సర్దుబాటు చేసారు. వీటన్నిటి ఫలితంగా 12,247 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. 3,156 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,073 స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్లు లేకుండాపోయారు. 100కంటే తక్కువ రోల్ వున్న ప్రీహైస్కూల్, హైస్కూళ్ళ నుండి హెడ్మాష్టర్, పిఇటి పోస్టులను తొలగించారు. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో వస్తూనే జిఓ 117 రద్దు చేస్తానని, విద్యా వ్యవస్థను సరిచేస్తామని హామీ ఇచ్చింది. దాని మేరకు జరిపిన ఎక్సరసైజ్ ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు చేసారు.

ప్రాథమిక పాఠశాలలు : ప్రాథమిక పాఠశాలలు రెండు రకాలుగా ఉంటాయి.

(1) బేసిక్ ప్రైమరీ స్కూల్

(2) మోడల్ ప్రైమరీ స్కూల్

(1) బేసిక్ ప్రైమరీ స్కూల్లో పిపి-1, పిపి-2తో బాటు 1,2 తరగతులు ఉంటాయి. సోషల్ బ్యారియర్స్, నేచురల్ బ్యారియర్స్ వున్న చోట పిపి-1, పిపి-2తో బాటు 1 నుండి 5 తరగతులు కూడా నిర్వహించబడతాయి. 20లోపు విద్యార్ధులకు ఒక ఎన్జటి, 21 నుండి 60లోపు విద్యార్థులకు ఇద్దరు ఎస్టీలు ఆపై ప్రతి 30మందికి ఒక ఎస్టి చొప్పున ఇస్తారు.

(2) ప్రతి రెవెన్యూ గ్రామ పంచాయితీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల సంఖ్య 100, అంతకంటే ఎక్కువ ఉంటే ప్రతి తరగతికి ఒక టీచర్ను ఇస్తారు. 120 రోల్ దాటిన ప్రతి స్కూల్కు ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్మాష్టర్ను ఇస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి మోడల్ ప్రైమరీ స్కూల్స్న పునః ప్రారంభిస్తారు. ముందుగా 70,80మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ ప్రైమరీ స్కూల్ను మోడల్ ప్రైమరీ స్కూల్గా గుర్తిస్తారు. 5 తరగతులకు 5గురు టీచర్లను ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2,3 ఏళ్ళలో 9వేల నుండి 10వేల పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ప్రాథమికోన్నత పాఠశాలలు: 6,7,8 తరగతుల విద్యార్ధులు 60కంటే తక్కువ ఉంటే ఆ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా తగ్గించాలని, 60కంటే ఎక్కువ ఉంటే దానిని ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 6,7,8 తరగతుల విద్యార్ధుల సంఖ్య 30లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలుగా డౌన్లోడ్ చేయబడతాయి. విద్యార్ధుల సంఖ్య 31 నుండి 59లోపు ఉండి గిరిజన ప్రాంతాలు, తండాలు, కాలనీలలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు సమీప హైస్కూల్ 5 కి.మీ.లు పైబడి దూరం ఉన్నట్లయితే వాటిని యుపి స్కూల్స్ కొనసాగిస్తారు. ఉన్నత పాఠశాలలు : 75, అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రతి హైస్కూల్కు హెచ్ఎం, పిఇటి పోస్టులు తప్పనిసరిగా ఇస్తారు. వర్క్డ్ 36 పీరియడ్లకు మించి లేకుండా చూస్తారు.

(2) ప్రమోషన్లకు సంబంధించి : ఈ విద్యా సంవత్సరం 2025 ఏప్రిల్లో ప్రమోషన్లు ఇచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ముందుగా ఉపాధ్యాయుల TIS (Teacher Information System) వివరాలు సరిచేసుకోవాలి. దీని కొరకు మూడుసార్లు అవకాశం ఇవ్వబడుతుంది. డిసెంబర్ 20, జనవరి 20, ఫిబ్రవరి 10లోగా ఉపాధ్యాయులు Teacher Information Systemలో తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. దాని ఆధారంగా ఫిబ్రవరి 15 నాటికి ప్రమోషన్ల సీనియార్టీ లిస్టు డ్రాఫ్ట్ విడుదల చేస్తారు. మార్చి 15లోపు తప్పులు ఉంటే తగిన ఆధారాలతో సరి చేయించుకోవచ్చు. మార్చి 15 నాటికి రూపొందించిన సీనియార్టీ ఆధారంగా మాత్రమే ఈ సంవత్సరం ప్రమోషన్లు నిర్వహించబడతాయి, ఫైనల్ సీనియార్టీ లిస్టు ఇచ్చిన తర్వాత తదుపరి కొత్తగా సీనియార్టీ లిస్టు తయారు చేసే వరకు ఎటువంటి మార్పులకు అవకాశం ఇవ్వరు. ఫైనల్ సీనియార్టీ లిస్టు ఆధారంగా మాత్రమే ప్రమోషన్లు జరుగుతాయి.

(3) బదిలీలకు సంబంధించి : ప్రతి సంవత్సరం మే 31 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అకడమిక్ ఇయర్గా పరిగణిస్తారు. బదిలీలకు కనిష్ట, గరిష్ట కాల పరిమితులు ఎన్జటి / స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్లకు మినిమమ్ 2 సం||లు - మాగ్జిమమ్ 8 సం||లు గజిటెడ్ హెడ్మాష్టర్లకు మినిమమ్ 2 సం॥లు మాగ్జిమమ్ 5 సం||లు

స్టేషన్ పాయింట్లు : హెచ్ఎస్ఏ ఆధారంగా పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. వీటి ఆధారంగా స్టేషన్ పాయింట్లు నిర్ణయిస్తారు.

కేటగిరీ-ఏ : 16% హెచ్ఐరా కలిగిన ప్రాంతాలు

· కేటగిరీ-బి : 12% హెచ్ఎస్ఏ కలిగిన ప్రాంతాలు

కేటగిరీ-సి : 10% హెచ్ఎస్ఏ కలిగి 5వేలుకంటే ఎక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు

-కేటగిరీ-డి : 10% హెచ్ఎస్ఏ కలిగి 5వేలుకంటే తక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు

సర్వీస్ పాయింట్లు : ప్రతి ఒక సంవత్సరం సర్వీస్కు ఒక పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్లు కేటాయిస్తారు.

మినహాయింపులు: 100% Visually Handicapped ລ້ 70% Orthopedically Handicapped 8, 3 సం||లలోపు రిటైర్మెంట్ కలిగిన వారికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని సంఘాలు కోరాయి.

స్పెషల్ కేటగిరీ : ఈ క్రింది స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు 5 పాయింట్ల చొప్పున అదనపు పాయింట్లు ఇవ్వాలని 2. (1) Un married female above 40 years age, (2) Spouse cases, (3) Phisically Handicapped 40% to 69%, (4) Diveroced women with dependent children under the age of 15 years (5) Single men with dependent children under the age of 15 years (6) NCC teachers (7) Spouse working in defenece services (8) Ex-service men (min 15 years service) (9) Recognized associations (State 10 points, District 5 points)

ప్రిఫరెన్షియల్ కేటగిరీ : గతం కంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీలు తగ్గించాలని నిర్ణయించారు. ఈ క్రింది కేటగిరీలు ప్రిఫరెన్షియల్ కేటగిరీలుగా పరిగణిస్తారు.

(1) 70%, అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగినవారు

(2) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడేవారు (క్యాన్సర్, బ్లడ్ డయాలసిస్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్)

(3) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మరియు మెంటల్లీ రిటార్డెడ్ ఆధారిత పిల్లలు / స్పౌజ్

మైనస్ మార్కులు : POSCO చట్టం పెట్టబడిన వారు, డిసిప్లినరీ యాక్షన్కు గురైనవారికి పాయింట్ల తగ్గింపు ఉండాలని ప్రతిపాదన,

(4) బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్: బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉండేలా రూపకల్పన చేయాలని ఆలోచిస్తున్నారు.

(1) TIS అప్డేషన్ - డిసెంబర్ 20 నుండి ఫిబ్రవరి 10లోపు

(2) సీనియార్టీ లిస్టుల తయారీ ఫిబ్రవరి 15 నుండి మార్చి 15లోపు

(3) బదిలీలు హెడ్మాష్టర్లు: ఏప్రిల్ 10 నుండి 15లోపు, స్కూల్ అసిస్టెంట్లు - ఏప్రిల్ 21 నుండి 25లోపు ఎస్టీలు - మే 1 నుండి 10లోపు

(4) ప్రమోషన్లు - హెడ్మాష్టర్లు ఏప్రిల్ 16 నుండి 20లోపు, స్కూల్ అసిస్టెంట్లు ఏప్రిల్ 26 నుండి 30లోపు

(5) డిఎస్సి రిక్రూట్మెంట్- మే 11 నుండి 30లోపు

( 5) హైస్కూల్ టైమింగ్స్ ఆలోచన: అసెంబ్లీ ఉ.9.00 నుండి 9.20 వరకు; మొదటి పీరియడ్ ఉ.9.30 - 10.15; రెండవపీరియడ్ 10.15 - 11.00; ఇంటర్వెల్ 11.00 - 11.15; మూడవ పీరియడ్ 11.15 - 12,00; నాలుగవ పీరియడ్ 12.00 - 12.45; ລ້ລ້ ລ້ 3.15; ໑໐໖ 3.15 - 3.30; 2 ລ້ 12.45 - 1.45; ໑໕ ໖ 0 3.30 - 4.15; 22 1.45 - 2.30; ໑໕ ໖ 2,30

0 4.15 - 5.00

 పై అంశాలపై మరింత లోతుగా చర్చించి డ్రాఫ్ట్ ఉత్తర్వులు నవంబర్ 30లోగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

Download Copy

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE