You might be interested in:
మెగా డీఎస్సీపై కూటమి సర్కార్ రోజుకొక్క అప్‌డేట్ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలకావల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే తిరిగి ఎప్పుడు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిన తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని గట్టిగా చెబుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ ఏపీ విద్యాశాఖ డీఎస్సీ సిలబస్‌కి సంబంధించి నిర్ధిష్ట ప్రకటన జారీ చేయలేదు. పాత సిలబస్ ప్రకారంగానే డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో చెప్పినప్పటికీ తాజాగా ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. డీఎస్సీ నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో డీఎస్సీ సిలబస్‌కు సంబంధించిన ప్రటకన విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
0 comment