You might be interested in:
సిఎస్సి సమావేశ వివరాలు
ఈరోజు పాఠశాల విద్య కమిషనర్&డైరెక్టర్ శ్రీ వి.విజయరామరాజు గారితో జరిగిన సమావేశ వివరాలు. సమావేశంలో డైరెక్టర్ శ్రీమతి పార్వతి మేడం, జెడి సర్వీసెస్ శ్రీ ఏ సుబ్బారెడ్డి, డిడి సర్వీసెస్ శ్రీమతి పి శైలజ, శ్రీ అబ్రహం, సిఎస్సి కార్యాలయ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు.
జీవో 117 రద్దు అనంతరం ఏర్పాటు చేయవలసిన కొత్త స్కూల్ పాటర్న్ గురించి చర్చించడం జరిగింది.
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు, ఉపాధ్యాయుల వర్కులోడ్ గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయుల వర్కులోడ్ వారానికి 32 పీరియడ్లకు మించకూడదని తెలపడం జరిగింది. కనీసం ఆరు, ఏడు వేలకు తక్కువ కాకుండా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేసి ప్రతి తరగతికి ఉపాధ్యాయుని నియమిస్తామన్నారు.
ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటులో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా పని వేళలు మార్పుపై కమిషనర్ గారు మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న పనివేళలు నవంబర్ 30 వరకు మాత్రమే ప్రతి మండలంలో ఒక పాఠశాలలో మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, రవాణా సౌకర్యం, విద్యార్థుల మానసిక స్థితి, బాలికల భద్రత, తదితర ఉపాధ్యాయ సంఘాలు తెలిపిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు.
బదిలీలలో ప్రాధాన్యత కేటగిరి కొరకు జిఏడి నిబంధనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుత బదిలీల జీవో 47 లోని నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక పాఠశాలలో ప్రాధాన్యత కేటగిరి ఉపాధ్యాయులను 30-40 శాతం మించకుండా చూస్తామన్నారు.
పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితా రూపకల్పనలో వస్తున్న సమస్యలు, ప్యానల్ సంవత్సరం తదితరఅంశాలను చర్చించడం జరిగింది.
పనిచేస్తున్న జిల్లాలోనే శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదని తెలుపగా 11 జిల్లాలలో శిక్షణ కేంద్రాలను గుర్తించారని, మరో రెండు జిల్లాలలో శిక్షణ కేంద్రాలను గుర్తించి వచ్చే సోమవారం నుండి అదే జిల్లాలలో మాత్రమే శిక్షణ నిర్వహిస్తామన్నారు.
డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
డిసెంబర్ మొదటివారం తర్వాత విద్యాశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
0 comment