You might be interested in:
ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఎవ్వరైనా ధనికులు కావచ్చు. సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకుని, మంచి ఆర్థిక ప్రణాళికను పాటిస్తే కచ్చితంగా ధనవంతులుగా మారవచ్చు. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో 2025 లో అయినా ధనికులు అయ్యేందుకు 8 చిట్కాలను ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే సంపదను పెంచుకోవడం పెద్ద కష్టమే కాదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ ను పక్కాగా ప్లాన్ చేసుకునేందుకు 50-30-20 రూల్ ను పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీరు సంపాందించే మొత్తంలో 50 శాతం నిత్యావసరాల కోసం, 30 శాతం మీకు ఇష్టమైన, ఇతర వాటి కోసం ఖర్చు చేసుకోవాలి. మిగతా 20 శాతం మాత్రం కచ్చితంగా పొదుపు చేయాలి. మీరు చేసిన ఖర్చులను ఓసారి చెక్ చేసుకోని అనవరమైన వాటిని తగ్గించుకుంటే సేవింగ్స్ ఎక్కువ చేసుకోవచ్చు.
ఇన్వెస్ట్ మెంట్
రిస్క్ తక్కువగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎన్ పీఎఎస్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటే స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడి విలువ పెరుగుతుందో లేదో తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అనుకున్న రాబడులు లేకపోతే స్ట్రాటజీని మార్చుకోవాలి
అత్యవసర నిధి
ఎలాంటి ఆదాయం లేకున్నా 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిశ్చింతగా జీవనం సాగించేలా ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్లోనే దీనిని మెయింటెన్ చేసుకుంటే బెటర్.
రుణాల నిర్వహణ
అప్పులు ఉంటే, అధిక వడ్డీ భారం ఉన్న వాటిని ముందుగా క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. పెనాల్టీలు లేకుండా క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ తేదీలోగా చెల్లించాలి. తప్పని పరిస్థితుల్లో అవసరమైతేనే లోన్ తీసుకోవాలి.
ఫైనాన్షియల్ ప్లానింగ్
తక్కువ సమయంలో అధిక రిటర్నులు వస్తాయనే ఆశతో రిస్క్ ఎక్కువగా సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఇంలాటి వాటిలో లాభాలు రాకపోగా భారీ నష్టాలు చవిచూడల్సి వస్తుంది. అందుకే వేటిలో ఇన్వెస్ట్ చేయాలనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి.
ట్యాక్స్
పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ట్యాక్స్ కన్సల్టెంట్ ని సంప్రదించాలి. దీని ద్వారా మినహాయింపులు ఎక్కువగా పొందే అవకాశాలుంటాయి
ఇన్సూరెన్స్
ఆర్థిక భద్రత కోసం లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ కుటుంబానికి భరోసా ఉంటుంది
0 comment