You might be interested in:
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎదో ఒక సందర్భంలో ఎంతో ఉపయోగకరంగా చేస్తుంది. ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగినపుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఖర్చులను కవర్ చేస్తాయి. ఒకోసారి ఇలాంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ ఒక ఆసరాగా ఉంటుంది కూడా
రూ.399తో 10 లక్షలు.. సామాన్యుల కోసం ఈ పోస్టాఫీస్ స్కిం చాలా సేఫ్..
అయితే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వస్తుంది, దీని ద్వారా పోస్టల్ శాఖలోని కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తారు. ఈ క్రమంలో పోస్టల్ శాఖ కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది. పోస్టల్ శాఖ ఈ కొత్త పథకం కింద రూ. 399 చెల్లిస్తే ప్రమాద బీమాను అందిస్తుంది. ఈ బీమా కింద ప్రమాదవశాత్తు ఒకరు మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తారు. ఒకవేళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే పోస్టల్ శాఖ ద్వారా కొంత డబ్బు అందించడం జరుగుతుంది.
రూ.399కి రూ.10 లక్షల వరకు బీమా: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఈ కొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. పోస్టాఫీసులో సేవింగ్స్ చేసే వారు ఎవరైనా ఈ రూ.399 బీమా తీసుకోవచ్చు. ఈ స్కిం కింద ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత అతనికి ఒక సంవత్సరం పాటు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.10 లక్షలు అందుతాయి. తీవ్రంగా గాయపడితే రూ.60 వేలు బెనిఫిట్ కింద ఇస్తారు. అలాగే ప్రమాదం జరిగిన వ్యక్తిని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్తే వాహన ఖర్చు కింద రూ.25వేలు ఇస్తారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్: పోస్టల్ డిపార్ట్మెంట్ అడిషనల్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. 399తో ఈ పథకం మొదలవుతుందని, ప్రభుత్వం నామమాత్రపు ధరకు పెద్ద బీమాను అందజేస్తున్న ఈ పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఒక సంవత్సరం పూర్తియిన తర్వాత ఈ బీమా పథకాన్ని వచ్చే ఏడాదికి మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి. అలాగే ఈ బీమా ప్రయోజనాన్ని పొందాలంటే కస్టమరుకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ తప్పనిసరి
ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు: ఈ బీమా పథకం కింద రూ. 399 ప్రీమియం బీమా ఏదైనా ప్రమాదం జరిగితే 10 రోజుల పాటు ఆసుపత్రిలో రోజుకు రూ. 1000 చొప్పున అలాగే వారి కుటుంబానికి రవాణా కోసం రూ. 25,000, మరణం సంభవించినట్లయితే అంత్యక్రియల కోసం రూ. 5,000 వరకు అందిస్తారు. ఈ బీమా ప్రయోజనాలను మరింతగా తెలుసుకోవడానికి మీరు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
0 comment