You might be interested in:
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) హర్యానా (haryana)లోని పానిపట్‌లో మహిళల కోసం ఒక కీలక పథకాన్ని ప్రారంభించారు. అదే ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన (మహిళా కెరీర్ ఏజెంట్లు - MCA ) స్కీం. మహిళల స్వావలంబన, ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
LIC బీమా సఖీ యోజన అంటే ఏంటి?
LIC బీమా సఖీ యోజన అనేది LIC ఏజెంట్లుగా మహిళలకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన స్టైపెండరీ పథకం. ఈ పథకం కింద మూడేళ్ల శిక్షణ కాలంలో మహిళలకు ప్రతినెలా స్టైఫండ్ అందజేస్తారు
ఎవరు అర్హులు
కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత కల్గి ఉండాలి
వయోపరిమితి: దరఖాస్తు సమయంలో కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
శిక్షణ కాలం: మూడేళ్లు.
స్టైపెండ్: మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000
రెండో సంవత్సరం: నెలకు రూ. 6,000 (మొదటి సంవత్సరం పాలసీలు 65% అమల్లో ఉండాలి)
మూడో సంవత్సరం: నెలకు రూ. 5,000 (రెండో సంవత్సరం పాలసీలు 65% అమలులో ఉండాలి)
దరఖాస్తుతో పాటు కింది పత్రాలను సమర్పించడం తప్పనిసరి:
వయస్సు రుజువు పత్రం (స్వీయ-ధృవీకరణ)
చిరునామా రుజువు పత్రం (స్వీయ-ధృవీకరణ)
విద్యా అర్హత సర్టిఫికేట్ (స్వీయ-ధృవీకరణ)
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అసంపూర్ణ సమాచారం లేదా తప్పిపోయిన పత్రాలు అప్లికేషన్ తిరస్కరించబడటానికి అవకాశం ఉంది
ఇప్పటికే ఉన్న ఏజెంట్లు లేదా LIC ఉద్యోగుల బంధువులు.
రిటైర్డ్ ఉద్యోగులు లేదా LIC మాజీ ఏజెంట్లు
MCA పథకం ముఖ్యమైన సూచనలు
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది స్టైపెండరీ పథకం మాత్రమే. కార్పొరేషన్‌లో శాశ్వత ఉపాధిగా పరిగణించబడదు.
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజనకు ఎలా దరఖాస్తు చేయాలంటే ?
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
0 comment