How to Create SMC Chairperson Login in School Attendance App - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

How to Create SMC Chairperson Login in School Attendance App

You might be interested in:

Sponsored Links

గౌరవ SMC చైర్ పర్సన్ గారికి, ప్రధానోపాధ్యాయులకు, MEOs,DEOs, RJDs,APCs,CMOs లకు  తెలియజేయునది ఏమనగా రాష్ట్రం లోని అన్ని SMC chair person  లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా లేదా క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారాSchool attendance app ని ఇన్స్టాల్  చేసుకొని SMC chair person తమ ఫోన్ నెంబర్ల తో రిజిష్టర్ అయ్యి పాస్వర్డ్ నీ సెట్ చేసుకొని PTM మాడ్యూల్ లోని ఇన్విటేషన్ ఐకాన్ ద్వారా ఆహ్వానిత వివరాలను ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈ రోజు సాయంత్రం 5గం ల లోపు పొందుపరచవలసిందిగా కోరుతున్నాము.

అందరూ మండల విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయడమేమనగా, స్కూల్ అటెండెన్స్ యాప్ ను పఠశాల చైర్మన్ గారి ఫోన్లో డౌన్లోడ్ చేయించవలసినదిగా మీ అందరినీ కోరడమైనది. ఆప్ డౌన్లోడ్ తర్వాత ఇన్విటేషన్ అనే మాడ్యూలను సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో 1) పిటిఎం ఇన్వైట్స్  2)కండక్ట్ పిటిఎం అనే రెండు కనిపిస్తాయి. ఈ రెండిట్లో పిటిఎం ఇన్వైట్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో 1) పేరెంట్స్ 2)ఎస్ఎంసి మెంబర్స్ 3)టీచర్స్ ఇన్విటేషన్ 4)అదర్స్ అను నాలుగు కనిపిస్తాయి. ఈ నాలుగుంటిలో 1)పేరెంట్స్ 2)ఎస్ఎంసి మెంబర్స్ 3)టీచర్స్ ఆటోమేటిగ్గా డిస్ప్లే అవుతాయి. ఇకపోతే నాలుగవది ఇన్విటేషన్ అధర్స్ లోకి వెళ్లి డేటాను జోడించండి అనే బటన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వైట్ చేయదలచుకున్న వారి యొక్క పేరు అడ్రస్సు ఫోన్ నంబరు మొదలుకు వాటిని నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎస్ఎంఎస్  వారికి వెంటనే వెళుతుంది. వాటి క్రింద గల లింకును క్లిక్ చేసినట్లయితే ఎస్ఎంఎస్ డౌన్లోడ్ అవుతుంది దానిని మీరు వాట్సాప్ ద్వారా కూడా వారికి షేర్ చేయవచ్చు. ఈ ప్రక్రియను ఈరోజు సాయంత్రం లోపల కమిటీ  చైర్మన్ను పాఠశాలకు పిలిపించుకుని పూర్తి చేస్తారని మీ అందరికీ మనవి చేయడమైనది.

 Conduct PTM అనే బటన్ పై క్లిక్ చేసినట్లయితే కార్యక్రమం తర్వాత నమోదు చేయవలసిన విద్యార్థులు తల్లిదండ్రులు కమిటీ సభ్యులు మరియు టీచర్ల హాజరు వివరాలు వగైరా అన్ని నమోదు చేయవలసి ఉంటుంది ప్రతి సందర్భంలో ఇందులో ఫోటోలు అడుగుతుంది కావున మీరు ఫోటోలను ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటే మంచిది. 

సమావేశం జరిగేటప్పుడు పూర్వ విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఇందులో అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్ని నమోదు చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిసోర్స్ అనే దాంట్లోకి వెళ్లి క్లిక్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసిన డేటా అంతా డౌన్లోడ్ అవుతుంది. దీనిని భవిష్యత్తులో అవసరాల కోసం వాడుకోవచ్చు.

స్కూల్ యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్ కి ఇవ్వబడిన స్కూల్ అటెండెన్స్ యాప్ లాగిన్ లో కేవలం SMC మరియు PTM కి ఇవ్వబడిన  మాడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఈ PTM మాడ్యూల్స్ ద్వారా  డిజిటల్ ఇన్విటేషన్ల ను, SMS లను ఆహ్వానితులకు పంపడానికి ఉపయోగపడతాయి. కార్యక్రమాల ఫోటోల వివరాలను అప్లోడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వీరి లాగిన్ లో ఇతర ఏ అంశాలు ఉండవు గమనించగలరు.


Download School Attendance App


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE