You might be interested in:
మీకు తక్కువ శాలరీ ఉందా. అయినా కూడా పర్లేదు. మీరు భవిష్యత్తులో 6 కోట్ల రూపాయలను సులభంగా సంపాదించుకోవచ్చు. అసాధ్యమేమీ కాదు. అయితే ఇది ఎలా సాధ్యం? నెలకు ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
సాధారణంగా ఫ్రెషర్స్ లేదా చిన్న వయస్సులో ఉద్యోగం ప్రారంభించే వ్యక్తులకు వారి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ. 15,000 వేల నుంచి రూ. 20 వేల జీతం వారు 6 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. మాములుగా అయితే లక్షల జీతం ఉన్న వారు కొంత ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. కానీ తక్కువ జీతం ఉన్న వారు సైతం ప్రతి నెల కూడా తక్కువ మొత్తంలో పెట్టుబడులు చేసి (Investment Tips) మంచి రాబడులను దక్కించుకోవచ్చు. దాని కోసం ప్రతి నెల ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఎంత పెట్టాలి, ఎన్నేళ్లు
దీర్ఘకాలంలో మంచి కార్పస్ మొత్తాన్ని పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ సిప్ (SIP) పెట్టుబడులు మంచి మార్గమని చెప్పవచ్చు. వీటిలో చేసిన పెట్టుబడులు వృద్ధి చెందడానికి కాంపౌండింగ్ విధానం ఉంటుంది. వారి నెలవారీ పెట్టుబడి మొత్తం పెరిగే కొద్ది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో రూ. 2000 నెలవారీగా SIP విధానంలో 40 ఏళ్లపాటు పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి చేయాలి. ఇలా 40 ఏళ్లపాటు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 9,60,000 అవుతుంది. ఈ క్రమంలో వార్షిక రాబడి 15 శాతం వడ్డీ చొప్పున చూస్తే 40 ఏళ్ల తర్వాత వారికి రూ. 6,28,07,511 లభిస్తాయి. ఈ నేపథ్యంలో వడ్డీల రూపంలోనే రూ. 6,18,47,511 కోట్లు వారికి వచ్చే అవకాశం ఉంటుంది.
సిప్ పెట్టుబడుల ద్వారా
మ్యూచువల్ ఫండ్స్ SIP (Systematic Investment Plan) పెట్టుబడులు చేయడానికి ఇది ఒక ప్రామాణిక పెట్టుబడి పథకం. ఇందులో మీరు నిరంతరం నెలవారీగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం కాంపౌండింగ్ వడ్డీ పద్ధతిని ఉపయోగించి, పెట్టుబడులు కాలక్రమంలో పెరుగుతాయి. అయితే సరైన పెట్టుబడులు చేయడం ద్వారా మీరు దశల వారీగా మీ సంపదను దీర్ఘకాలంలో భారీగా పెంచుకోవచ్చు.
సరైన సమయంలో
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మీరు మొదటి సంవత్సరంలో పెద్ద మొత్తం పెట్టుబడి చేయకపోయినా, ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడులు చేస్తూ పోతే, సమయం గడిచే కొద్దీ వాటి వృద్ధిని చూస్తూ పోతారు. ఆ క్రమంలో 40 సంవత్సరాల కాలంలో మీ పెట్టుబడులపై 15% వృద్ధి, మీ సంపాదనకు తోడ్పడుతుంది. SIPలో పెట్టుబడులు పెట్టే క్రమం, విస్తృతంగా పొదుపు చేయడం, దీర్ఘకాలంలో పెట్టుబడులు చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో సంపాదించుకుంటారు. చిన్న వయస్సులో లేదా తక్కువ జీతంలో ఉన్న ఉద్యోగులు కూడా సరైన పెట్టుబడులు సమయానికి పెట్టుకుంటే మీరు 6 కోట్ల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు.
(గమనిక: ఇది పెట్టుబడి సలహా కాదు. మీకు దీనిపై ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తప్పకుండా తీసుకోండి)
0 comment