You might be interested in:
ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ (WhatsApp)నకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ (WhatsApp Pay) సేవలపై పరిమితులను ఎత్తేసింది. ఆ మేరకు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం భారత్‌లో కేవలం పది కోట్ల మంది మాత్రమే వాట్సాప్ పేమెంట్ సేవలను వినియోగించుకుంటున్నారు.
భారత్‌లో ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా వాట్సాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. గతంలో మెసేజింగ్ సేవలకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సేవలను కూడా ప్రారంభించింది. అయితే వాట్సాప్ పేమెంట్ సేవలపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2020లో వాట్సాప్ పేమెంట్ సేవలను కేవలం 4 కోట్ల మంది వినియోగించుకునేందుకే అవకాశం కల్పించింది. 2022లో ఆ పరిమితిని పది కోట్ల మందికి పెంచింది. తాజాగా ఆ పరిమితిని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో త్వరలోనే వాట్సాప్ పేమెంట్ సేవలు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే మీ ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయాలంటే భారత్‌లో అకౌంట్ ఉండాలి. అలాగే వాడుకలో ఉన్న డెబిట్ కార్డు ఉండాలి. వాట్సాప్‌లో కూడా చెల్లింపుదారు, లబ్ధిదారుల మధ్య లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతాయి.
0 comment