You might be interested in:
APPSC Job Calendar 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. స్వామి వివేకానంద జయంతి (Swami Vivekananda Jayanti 2025) సందర్భంగా జనవరి 12వ తేదీన ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ఆరోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ విషయం కొత్తగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు కూడా ప్రకటించనుంది.
అదే రోజు కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు సంబంధించి 18 నోటిఫికేషన్లపై కూడా ప్రకటన రానుంది. వీటిలో అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. అలాగే.. దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్- టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తికానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
0 comment