You might be interested in:
ఉండవల్లి లో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
•*ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదల పై చర్చ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక
*అన్ని వర్గాలకు కలిపి రూ. 6700కోట్లు బిల్లులు, ప్రభుత్ బకాయిలు విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం*
• సంక్రాంతి నాటికి బిల్లుల, బకాయిలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
• ఉద్యోగులకు జీపిఎఫ్, సరెండర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం రూ. 1300 కోట్లు.
• ఉద్యోగులకు రూ. 519 కోట్లు జీపిఎఫ్ విడుదల
• పోలీసు శాఖ కు సంబంధించి నాలుగు సరెండర్ లీవుల పెండింగ్
• పోలీసులకు ఒక ఇన్ స్టాల్మెంట్ సరెండర్ లీవులకు మొత్తం రూ.214 కోట్ల విడుదల. 54 వేల 900 మంది పోలీసులకు లబ్ది
• రూ. 300 కోట్ల ఒక నెల సిపిఎస్ కంట్రిబ్యూషన్ విడుదల
• సిఎస్ఎస్ స్కీమ్స్ కు రూ. 627 కోట్లు
• టిడిఎస్ చెల్లింపులు రూ. 265 కోట్లు
• అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రూ. 244 కోట్లు కౌలు చెల్లింపు
• ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు ఆసుపత్రులకు చెల్లించేందుకు రూ. 400 కోట్లు
• డ్రగ్స్, మెడిసిన్స్ కు రూ. 100 కోట్లు.
• స్టూడెంట్స్ కు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద రూ. 788 కోట్లు. 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ది.
• ప్రభుత్వ కాంట్రాక్టులు చేసి రూ. 10 లక్షల లోపు ఉన్న అన్ని బిల్లులు రిలీజ్ చేస్తాం. దాదాపు రూ. 506 కోట్లు విడుదల
• 26,000 వేల మంది కాంట్రాక్టర్లకు లబ్ది. వీరితో పాటు భూసేకరణ లబ్దిదారులు కూడా నిథులు విడుదల.
• ఎంఎస్ఎంఈ రూ. 90 కోట్లు. 651 కంపెనీలు, 6651 లబ్దిదారులు
• విద్యుత్ శాఖ్ డిస్కంలకు రూ. 500 కోట్లు విడుదల
• ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణా బిల్లులు రూ. 366 కోట్లు.
• ఇవి కాకుండా పెండింగ్ లో ఉన్న మరి కొన్ని బిల్లులు, బకాయిలు విడుదల.
• మొత్తం కలిపి రూ. 6700 కోట్లు విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశం.
• రేపటి నుంచి లబ్దిదారుల అకౌంట్లలో జమ అవ్వనున్న నిధులు
0 comment