రాష్ట్రంలో త్వరలో పేదలకు ఇంటి స్థలాలు... ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

రాష్ట్రంలో త్వరలో పేదలకు ఇంటి స్థలాలు... ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

You might be interested in:

Sponsored Links

రాష్ట్రంలో త్వరలో పేదలకు ఇంటి స్థలాలు... ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద *గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు* కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 మార్గదర్శకాలు ఇవే...

▪️పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపు.

▪️పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం.

▪️ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడి.

▪️అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు.

▪️పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలి.

▪️ప్లాటును ఆధారు, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి.


 *అర్హతలు ఇవే...* 


▪️తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి.

▪️ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు.

▪️కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు.

▪️కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ది పొంది ఉండకూడదు.

▪️అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు.

▪️ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ.

▪️గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయం.

▪️ఇప్పటికే ఇంటి స్థలం పోందినా ఇల్లు నిర్మంచని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయింపు.


 *లబ్దిదారుల ఎంపిక ...* 


▪️విలేజి, వార్డు స్ధాయిలో ధరఖాస్తు చేసుకోవాలి.

▪️వీఆర్వో, ఆర్‌‌ఐల ద్వారా విచారణ చేయించాలి.

▪️లిస్టును గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు స్వీకరణ.

▪️తుది జాబితాను ఎమ్మార్వోలు, మున్సిపల్ కమీషనర్‌లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌లకు పంపాలి.

▪️లబ్దిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామల్లో భూమి స్ధలం కేటాయింపుకు కలెక్టర్‌కు అధికారం.

▪️ఎవ్వరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం.

▪️రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్‌ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE