పాఠశాల విద్య కమిషనర్ గారితో సమావేశ వివరాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

పాఠశాల విద్య కమిషనర్ గారితో సమావేశ వివరాలు

You might be interested in:

Sponsored Links

పాఠశాల విద్య కమిషనర్ గారితో సమావేశ వివరాలు ఈరోజు పాఠశాల విద్య కమిషనర్ శ్రీ వి.విజయరామరాజు గారితో జరిగిన సమావేశంలో క్రింది అంశాలను ప్రకటించడం జరిగింది.

👉వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాల భారం తగ్గించడానికి వీలుగా 1,2 తరగతులకు మొదటి సెమిస్టర్ కు అన్ని సబ్జెక్టులకు కలిపి 1 టెక్స్ట్ బుక్, 1 వర్క్ బుక్, రెండవ సెమిస్టర్ కు 1 టెక్స్ట్ బుక్, 1 వర్క్ బుక్ మాత్రమే ఉంటాయి. 3 - 5 తరగతులకు ఫస్ట్ సెమిస్టర్ కు లాంగ్వేజెస్ కు ఒక టెక్స్ట్ బుక్ ఒక వర్క్ బుక్, సబ్జెక్టులకు ఒక టెక్స్ట్ బుక్,ఒక వర్క్ బుక్ రూపొందించడం జరిగింది.

👉వచ్చే విద్యా సంవత్సరంలో 9,10 తరగతుల విద్యార్థులకు హిందీ పాఠ్యపుస్తకము ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాత పుస్తకాన్ని అందిస్తారు.

👉సోషల్ తో పాటు వివిధ సబ్జెక్టులలో కొన్ని పాఠ్యాంశాలను తొలగించి అమలు చేస్తారు.

👉2026- 27 విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి వీలుగా పాఠ్యపుస్తకాలపై సూచనలు సలహాలు కోరడం జరిగింది.

👉వివిధ తరగతులలో తగ్గించిన సిలబస్ పై జూన్ నెలలో ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు.

👉విద్యార్థులను అసెస్మెంట్ చేయుటకు నిర్వహించే పరీక్షలకు గాను సబ్జెక్టు వారిగా ఒక పుస్తకాన్ని అందిస్తారు.

?ఎస్సీఈఆర్టీ ద్వారా టీచర్ మాడ్యూల్ రూపొందించి పాఠ్యాంశ బోధనకు అవసరమైన అదనపు సమాచారాన్ని అందిస్తారు.

👉ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్షలు నిర్వహించడం, వాటిని మూల్యాంకనం చేయడానికి మండల, జిల్లా స్థాయికి పంపడం కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

👉పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠ్యాంశానికి ముందు విద్యార్థుల నుండి రావాల్సిన ఔట్ కమ్స్ పొందుపరచడం జరుగుతుంది.

👉బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు కొనసాగిస్తారు.

👉అకడమిక్ క్యాలెండర్ ను ఫిబ్రవరి నాటికి అందిస్తారు.

👉టిఐఎస్ నందు వివరాలను సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యేలోపు అప్డేట్ చేయాలని కోరారు. ఈరోజుకు 94 వేల మంది ఉపాధ్యాయులు టిఐఎస్ పూర్తి చేశారు.

👉పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో ఉంచుతారు.

👉కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డిటెన్షన్ పాలసీపై అభిప్రాయాలు,సూచనలు తెలపాలని కోరారు.

👉117 జీవో రద్దు అనంతరం తీసుకువచ్చే జీవోపై నిన్న ఇచ్చిన ముసాయిదా నిబంధనల మేరకు కమిషనర్ గారు జనవరి 20వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం అవుతారు.

👉క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా జనవరి నెల చివరి నాటికి జీవో విడుదల చేస్తారు.

👉అప్పటివరకు సూచనలు సలహాలు స్వీకరిస్తారు.

👉ప్రతి పంచాయతీలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేస్తారు. ఒక పంచాయతీలో 60 మంది పైగా విద్యార్థులు గల పాఠశాలలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా దానిని కూడా ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా నిర్వహిస్తారు.

👉తెలుగు సమాంతర మాధ్యమాన్ని కొనసాగించాలని కోరగా, ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే ఉంటుందని, ఈ సంవత్సరంతో పాటు రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు తెలుగు మాధ్యమంలో కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

👉పురపాలక పాఠశాలల్లో కూడా తీసుకొచ్చే కొత్త జీవో ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అయితే పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నందున అదనంగా కావలసిన పోస్టులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

👉75 మంది పైగా విద్యార్థులు గల ఉన్నత పాఠశాలకు హెచ్ఎం, పిడి పోస్టులను మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో ఇంకా సర్ ప్లస్ గా ఉంటే డిసెండింగ్ ఆర్డర్లో సర్దుబాటు చేస్తారు.

అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయిన ఉపాధ్యాయులకు బదిలీలలో నెలకు ఒక పాయింట్ చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.

👉జనవరి చివరి నాటికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడవచ్చని, ఫిబ్రవరి మార్చి నెలలో బదిలీల చట్టం అసెంబ్లీలో చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

👉సంక్రాంతి సెలవుల్లో ఎస్.ఎస్.సి యాక్షన్ ప్లాన్ లో విద్యార్థులకు సెల్ఫ్ ప్రిపరేషన్ తప్ప క్లాసుల నిర్వహణ లేదని, కానీ క్రింది స్థాయిలో సెలవులలో కూడా క్లాసులు నిర్వహించాలని వత్తిడి చేస్తున్న విషయంపై ప్రస్తావించగా విల్లింగ్ ఉంటే నిర్వహించండి తప్పనిసరి కాదని తెలిపారు.

👉పురపాలక ఉపాధ్యాయులకు ఇంటర్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలు చేపట్టాలని కోరగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలని తెలిపారు.

👉బదిలీలలో పాయింట్ల కేటాయింపు, ప్రాధాన్యత కేటగిరి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE