విద్యాశాఖ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో ముఖ్యాంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

విద్యాశాఖ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో ముఖ్యాంశాలు

You might be interested in:

Sponsored Links

ఈ రోజు 10.01.25 న విద్యాశాఖ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో ఈ క్రింది అంశాలు చర్చించడం జరిగింది.

1. పాఠ్య పుస్తకాలు :

1-5 తరగతుల సిలబస్ తగ్గించారు, పిల్లలకు పాఠ్య పుస్తకాలు భారం సైతం తగ్గించారు.

విద్యా సంవత్సరాన్ని రెండు సెమిస్టర్లుగా విభజించి ప్రతి సెమిస్టర్కు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ విడి విడిగా రూపొందించారు. మొదటి సెమిస్టర్ పుస్తకాలలో ఎస్ఏ-1, ఎఫ్ఎ-2, ఎస్ఏ-1 సిలబస్ ఉండేలా, రెండవ సెమిస్టర్ పుస్తకాలలో ఎఫ్ఎ-3, ఎఫ్ఎ-4, ఎస్ఏ-2 సిలబస్ ఉండేలా పాఠ్యాంశాలను విభజించారు.

1.2 తరగతులకు అన్ని సబ్జెక్టులు కలిపి ఒక టెక్స్ట్ బుక్, ఒక వర్బుక్ ఉండే విధంగా రూపొందించారు. అంటే ప్రతి సెమిస్టర్కు రెండు పుస్తకాలు (టెక్స్ట్ బుక్, వర్డ్బుక్) ఇస్తారు.

3,4,5 తరగతులకు లాంగ్వేజస్, నాన్ లాంగ్వేజస్ టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ ఉండే విధంగా రూపొందించారు. అంటే ప్రతి సెమిస్టర్కు నాలుగు పుస్తకాలు (రెండు టెక్స్ట్ బుక్స్, రెండు వర్క్ బుక్స్) ఇస్తారు.

9,10 తరగతులకు హిందీ సబ్జెక్టు సంబంధించి ఎన్సిఇఆర్డి సిలబస్ కాకుండా గతంలో ఎన్సిఇఆర్ టి రూపొందించిన సిలబస్ పుస్తకాలనే ఉపయోగించాలని నిర్ణయించారు.

ఎస్సీఇఆర్ టి నిర్ణయించినట్లుగా సోషల్ స్టడీస్ పుస్తకాలలో నాలుగు చాప్టర్లు తగ్గించారు.

ఇంగ్లీషు పుస్తకాలలో కూడా కొంత సిలబస్ తగ్గించినట్లు చెప్పారు.

టెక్స్ట్ బుక్స్లో ప్రతి పాఠానికి అవుట్ కమ్ లెర్నింగ్స్ నిర్ణయించి ముద్రిస్తారు.

వచ్చే సంవత్సరం పాఠ్య పుస్తకాలలో మార్పు ఉంటుంది.

2. అకడమిక్ క్యాలెండర్:

2026-27 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ డ్రాఫ్ట్ ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

జూన్ 5వ తర్వాత మారిన పాఠ్యాంశాలపై ప్రతి టీచర్కు 2-3 రోజులు ఒరియంటేషన్ ప్రొగ్రామ్ ఉంటుంది. ప్రతి టీచర్కు లెసన్ ప్లాన్, టిఎల్ఎం, డైర్ రూపొందించి ఒక పుస్తక రూపంలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

3. అసెస్మెంట్ బుక్స్:

విద్యార్థి ఒక సంవత్సరంలో వ్రాసే పరీక్ష పత్రాలన్నీ ఒకే బుక్లో ఉండే విధంగా అసెస్మెంట్ బుక్ రూపొందిస్తామని తెలియజేసారు.

ప్రతి సబ్జెక్టుకు ఎఫ్ఎలు, ఎస్ఏలు జవాబు పత్రాలన్నీ ఒకే పుస్తకంలో విద్యార్థి వ్రాసేలా పుస్తకాలు రూపొందిస్తున్నారు.

1-5 తరగతులకు పరీక్షలలో ఇకపై ఓఎంఆర్ షీట్లు ఉండవు.

4. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ :

ఇప్పటి వరకు 94వేలమంది ఉపాధ్యాయులు తమ వివరాలు TISలో నమోదు చేసారు. మిగిలిన వారికి జనవరి 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. 20వ తేదీ తర్వాత TISలో నమోదు చేసే అవకాశం నిలిపివేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జనవరి 19లోగా తమ వివరాలు TISలో నమోదు చేయాలి.

5. జిఓ 117కు ప్రత్యామ్నాయ ఉత్తర్వుల డ్రాఫ్ట్:

. 117 ລ້ລ້ Memo No.ESE02-13021/4/2024, DL09.01.2025 2 .

దీనిపై ఆర్జెడి, డిఇఓ, డివైఇఓ, ఎంఇఓ, క్లస్టర్ హెడ్మాష్టర్లకు జనవరి 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లా సమావేశాలు పెట్టి ప్రభుత్వ ఉత్తర్వులను ఎలా అమలు చేయాలో వివరిస్తారు.

జనవరి 19 నాటికి ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ ఖరారు చేసుకోవాలి. వాస్తవంగా ఉన్న పిల్లలనే చూపాలి. వెరిఫికేషన్లో తేడా ఉంటే యాక్షన్ తీసుకుంటారు.

జనవరి 19వ తేదీ తర్వాత ఎవరూ కొత్తగా విద్యార్థులను ఎన్రోల్ చేసుకోకూడదు.

60 పైబడి విద్యార్ధులు ఉన్న ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించి 5 తరగతులకు 5గురు ఉపాధ్యాయులను ఇస్తారు.

గ్రామంలో 2,3 ప్రాథమిక పాఠశాలలు ఉన్నప్పుడు ఏ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా గుర్తించాలో ఎస్ఎంసి కమిటీల సమావేశం పెట్టి నిర్ధారిస్తారు. తలిదండ్రులు అంగీకరిస్తే ఆ పాఠశాలకు మిగిలిన పాఠశాలల 3,4,5 తరగతుల విద్యార్థులను తరలిస్తారు. 45రోలు ఉన్నప్పటికీ కూడా మోడల్ ప్రైమర్ స్కూల్ ఏర్పాటు కోరుకుంటే అనుమతిస్తారు.

ఒకవేళ గ్రామంలో 2,3 పాఠశాలలు 60 పైబడి రోల్ ఉంటే అన్నిటిని మోడల్ ప్రైమరీ స్కూల్స్ గుర్తిస్తారు.

6,7,8 తరగతుల రోలు 30లోపు ఉంటే ఆ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్చి 6,7,8 తరగతుల విద్యార్థులను 3 కి.మీ. దూరంలో లోపు ఉన్న హైస్కూల్కు తరలిస్తారు. అలాగే 31-59లోపు విద్యార్ధులు ఉన్న యుపి తరగతులను తలిదండ్రులు అంగీకరిస్తే వారిని కూడా హైస్కూల్కు తరలిస్తారు. వీరికి ట్రాన్స్పోర్టు అలవెన్స్ చెల్లిస్తారు. 60పైబడి రోల్ ఉంటే ఆ పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తారు.

75 రోల్ ఉన్న ప్రతి హైస్కూల్కు హెడ్మాష్టర్, పిఇటి తప్పనిసరిగా ఉంటారు. ఒక తరగతిలో 54 పైబడి విద్యార్ధులు ఉంటే రెండవ సెక్షన్ మంజూరు చేస్తారు. సెక్షన్ల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరుగుతుంది.

6. బదిలీలు:

70%-80% అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులను ప్రిఫరెన్షియల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు.

పాఠశాలలో ఒకే సబ్జెక్టు సంబంధించి రెండు పోస్టులు ఉంటే వాటిలో ఒక పోస్టు మాత్రమే ప్రిఫరన్షియల్ కేటగిరిలో ఉపాధ్యాయులు కోరుకొనడానికి అనుమతించబడుతుంది.




0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE