You might be interested in:
Andhra Pradesh Whatsapp Governance Number: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది. ఇందులో దాదాపు 161 సేవలను అందిస్తోంది.
ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకులు ఇలాంటి సేవలు అందిస్తూ వచ్చాయి. మీ అకౌంట్ నెంబర్ రిలేటెడ్ క్వారీల కోసం బ్యాంకులు ఈ సేవలు అందించేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని ప్రజలకు చేరువ చేసింది.
ముందుగా మీరు ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ 9552300009ను సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా సేవ చేసుకున్న తర్వాత వాట్సాప్ రిఫ్రెష్ చేసి చూస్తే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అనే వెరిఫైడ్ అకౌంట్ చూపిస్తుంది. అందుకో మీకు కావాల్సిన సేవలను పొందవచ్చు. ఈ వాట్సాప్ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే అక్కడి నుంచి మీకు రిప్లై వస్తుంది.
సమాచారం అంతా తెలుగులోనే ఉంటుంది. వాట్సాప్లో ఆంధ్కరప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. వివిధ పౌర సేవలను సులభంగా త్వరితంగా, పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాం దయచేసి మీకు కావాల్సిన పౌరసేవలను ఎంచుకోండని చూపిస్తుంది.
అందులో సేవను ఎంచుకోండి అని హైలైట్ చేసి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే... ప్రభుత్వ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వాట్సాప్లో ప్రభుత్వం అందించే 161 సేవలు ఉంటాయి. దయచేసి ఒక సేవ ఎంచుకోండి అని ఉన్న చోట క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే 9 విభాగాలు కనిపిస్తాయి.
అవి ఇవే:-
1. దేవాలయ బుకింగ్ సేవలు
2. ఫిర్యాదు పరిష్కార సేవలు
3. ఏపీఎస్ఆర్టీసీ సేవలు
4. ఎనర్జీ సేవలు అంటే విద్యుత్ రిలేటెడ్ సేవలు
5. సీఎంఆర్ఎఫ్ సేవలు
6. సీడీఎంఏ సేవలు
7. రెవెన్యూ సేవలు
8. ఆరోగ్య కార్డు సేవలు
9. పోలీస్ శాఖ సేవలు
ఇలా తొమ్మిది విభాగాలు ఉంటాయి. అందులో మనకు కావాల్సిన వాటిపై క్లిక్ చేసి సేవలు పొందవచ్చు.
ఆర్టీసీ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఆర్టీసీ సేవలపై టిక్ చేయాలి. అలా చేసిన వెంటనే టికెట్ బుక్ చేసుకోవడమా, టికెట్ రద్దు చేసుకోవడమా ఏ సేవ కావాలో అని అడుగుతుంది. అందులో టికెట్ బుకింగ్పై క్లిక్ చేస్తే నిర్దారించమని అడుగుతుంది. వెంటనే ఓకే చేస్తే మెసేజ్ సెంట్ అవుతుంది.
0 comment