You might be interested in:
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (DFCCIL) అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ విభాగంలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య, అప్లికేషన్ తేదీలు, వయోపరిమితి, ఫీజు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notifications Telegram Channel:
మొత్తం పోస్టుల సంఖ్య: 642, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(464), జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ (03), ఎగ్జిక్యూటీవ్ సివిల్(36), ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ (64), ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్)(75)
అప్లికేషన్ ప్రారంభం : 18/01/2025
అప్లికేషన్ చివరి తేదీ: 16/02/2025
అప్లికేషన్ ఎడిట్ తేదీలు: 23 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు
స్టేజ్ 1 ఎగ్జామ్ డేట్: ఏప్రిల్ 2025
స్టేజ్ 2 ఎగ్జామ్ డేట్: ఆగస్టు 2025
ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్టు: అక్టోబర్/ నవంబర్ 2025
అడ్మిట్ కార్డు విడుదల: పరీక్షకు వారం రోజుల ముందు
అప్లికేషన్ ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ. 1000, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ. 500 గా ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
వయోపరిమితి : కనిష్ట వయోపరిమితి 18 ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి 30ఏళ్లుగా ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అభ్యర్థులకు వయోపరిమితి 33 ఏళ్లుగా ఉంది. అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంది.
విద్యార్హతలు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అభ్యర్థులకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు, ఒక సంవత్సరం ఐటీఐ అప్రెంటీస్ చేసి ఉండాలి.
జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ : సీఏ/ సీఎంఏ సర్టిఫికెట్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు : సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిప్లోమా లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
0 comment