ESIC IMO Recruitment 2025: ఈఎస్ఐసీలో 608 జాబ్స్.. తక్కువ కాంపిటిషన్.. నెలకు రూ. 56 వేల జీతం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ESIC IMO Recruitment 2025: ఈఎస్ఐసీలో 608 జాబ్స్.. తక్కువ కాంపిటిషన్.. నెలకు రూ. 56 వేల జీతం

You might be interested in:

Sponsored Links

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈజీగా పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 56 వేల జీతం అందుకోవచ్చు. ఇటీవల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈఎస్ఐసీ 608 పోస్టులను భర్తీ చేయనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తై ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ఈ పోస్టులకు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.56,100- 1,77,500 వేతనం అందిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ESIC అధికారిక వెబ్ సైట్ www.esic.gov.in/recruitments ను సందర్శించాల్సి ఉంటుంది.


Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE