Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల! - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల!

You might be interested in:

Sponsored Links

 IBPS: నిరుద్యోగులకు IBPS శుభవార్త చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇందులో RRBలో ఆఫీసర్ స్కేల్ 1,2,3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలున్నాయి.

రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కోసం https://www.ibps.in/ వెబ్ సైట్ సందర్శించండి.

పరీక్షల తేదీలు ఇవే..

ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వివిధ పరీక్షల షెడ్యూల్ను వివరిస్తూ 2025కి సంబంధించిన పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. IBPS, RRB ఆఫీసర్ స్కేల్ I కోసం ప్రిలిమినరీ పరీక్ష జూలై 27, ఆగస్టు 2 ఆగస్ట్ 3, 2025న షెడ్యూల్ చేయబడింది. IBPS పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లు (PSB) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీలు (MT), స్పెషలిస్ట్ ఆఫీసర్లు, కస్టమర్ సర్వీస్ అసోసియేట్లు వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ పరీక్షలు అక్టోబర్ 4, 5, 11 తేదీలలో జరగనున్నాయి.

దేశవ్యాప్తంగా ఆఫీస్ అసిస్టెంట్లు (క్లార్క్), ఆఫీసర్ స్కేల్ 1 (PO), ఆఫీసర్స్ స్కేల్ 2, 3, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA/క్లార్క్), స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది. లక్షల మంది విద్యార్థుల రిక్రూట్మెంట్ కోసం ఐబీపీఎస్ ఏటా వీటిని నిర్వహిస్తోంది. బ్యాంకింగ్ కోసం ఆసక్తి ఉన్న వారందరికీ ఇది సువర్ణావకాశం

1. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు 2025 జూలై 27, ఆగస్టు 02, 03.

2. IBPS RRB PO మెయిన్స్ పరీక్ష తేదీ 13 సెప్టెంబర్ 2025

3. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు 2025 ఆగస్టు 30, సెప్టెంబర్ 06, 07.

4. IBPS RRB Clerk మెయిన్స్ పరీక్ష తేదీ 09 నవంబర్ 2025

5. IBPS RRB Officer II and III ఎగ్జామ్ డేట్ 13 సెప్టెంబర్ 2025

6. IBPS PO Prelims ఎగ్జామ్ డేట్ 04, 05, 11 అక్టోబర్ 2025

7. IBPS PO Mains ఎగ్జామ్ డేట్ 29 నవంబర్ 2025

8. IBPS SO Prelims ఎగ్జామ్ డేట్ 23 నవంబర్ 2025

9. IBPS Clerk Prelims పరీక్ష తేది 06, 07, 13, 14 డిసెంబర్ 2025

10. IBPSC SO Mains ఎగ్జామ్ డేట్ 04 జనవరి 2026

11. IBPS Clerk Mains ఎగ్జామ్ 01 ఫిబ్రవరి 2026



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE