You might be interested in:
Sponsored Links
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ నియామక పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) తేదీలు రైల్వే శాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను పది రోజుల ముందు పొందవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు తదితర సమాచారం ఉంటుంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. గత ఏడాది 452 ఎస్సై, 4208 కానిస్టేబుల్ ఖాళీలతో మొత్తం 4,660 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్సై పరీక్షలు గత డిసెంబర్లో జరిగాయి.
0 comment