RRB Group D Posts 32438 Posts | రైల్వే శాఖలో 32438 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

RRB Group D Posts 32438 Posts | రైల్వే శాఖలో 32438 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

You might be interested in:

Sponsored Links

RRB Recruitment-32,438 Level 1 posts: భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారీ ఏకంగా 32 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మంగళవారం నోటీషికేషన్ జారీ చేసింది. RRBల అధికారిక వెబ్‌సైట్ - rrbapply.gov.inలో అందించిన వివరాలు ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 ఉదయం 12 గంటలకు ప్రారంభమవుతుంది

RRB Group D Posts 32438 Posts | రైల్వే శాఖలో 32438 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల 

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు  కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

మొత్తం ఖాళీలు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ రిక్రూట్ మెంట్ బోర్డ్)-32,438 ఉద్యోగాలు

జీతం: మొదటగా 18000 చెల్లిస్తారు

rrbapply.gov.in లో పేర్కొన్న అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. లెవల్ 1లోని వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ (RRB CEN నం. 08/2024) ను ఆర్ఆర్బీ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 7వ CPC పే మ్యాట్రిక్స్ లెవల్ 1లో మొత్తం 32438 పోస్టులు భర్తీ చేయనున్నారు

ముఖ్యమైన తేదీలు:

ఈ భారీ నోటిఫికేషన్ కోసం RRB జనవరి 23, 2025న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా మార్పులు చేసుకోవడానికి విండో ఫిబ్రవరి 25 నుండి మార్చి 6, 2025 వరకు తెరిచివుంటుంది

RRB రిక్రూట్‌మెంట్ 2025: ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నాలుగు దశలను కలిగి ఉంటుంది.

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ ఎగ్జామినేషన్.

CBTలో 100 ప్రశ్నలు 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. తప్పు సమాధానాలకు పెనాల్టీ వర్తిస్తుంది, ప్రతి తప్పు జవాబుకు 1/3వ వంతు మార్కు కట్ అవుతుంది

RRB రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు

1. దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 23, 2025

2. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025

3. ముగింపు తేదీ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీ: ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు

4. మార్పుల కోసం తేదీ, సమయం: ఫిబ్రవరి 25 నుండి మార్చి 6, 2025 వరకు

అర్హతలు:

టెన్త్ పాసైన అభ్యర్థులు గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డీ జాబ్ అభ్యర్థులకు ఇకపై ఐటీఐ డిప్లొమా తప్పనిసరి కాదు. టెక్నికల్ డిపార్ట్మెంట్లకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) ఇచ్చిన న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా తప్పనిసరిగా ఉండాలి. న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేరు.

పోస్టులు:

పాయింట్స్‌మన్-బి- 5058 

అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799 

అసిస్టెంట్ (వంతెన)- 301 

ట్రాక్ మెయింటెయినర్ Gr. IV- 13187 

అసిస్టెంట్ పి-వే - 247 

అసిస్టెంట్ (C&W)- 2587 

అసిస్టెంట్ TRD -1381 

అసిస్టెంట్ (S&T)- 2012 

అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్)- 420 

అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950 

అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)- 744 

అసిస్టెంట్ TL & AC- 1041 

అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్)- 624 

అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్)- 3077

అర్హత ప్రమాణాలు

జనవరి 1, 2025 నాటికి వయస్సు 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

OBC నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు

Ex Servicemen అభ్యర్థులకు UR & EWS వారికి మూడు సంవత్సరాలు, OBC నాని క్రిమిలే అభ్యర్థులకు ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 8 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు

PwBD అభ్యర్థులకు కూడా వయసులో సడలింపు కలదు నోటిఫికేషన్ పరిశీలించగలరు

దరఖాస్తు రుసుము

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 500, SC, ST, Ex-Serviceman, PWBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈ రుసుము రూ. 250.

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మొదట ఆన్‌లైన్ పరీక్ష స్టెజ్ 1 - CBT 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్ పరీక్ష స్టేజ్ 2 - CBT 2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాసైన వారికి తర్వాత దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చివరకు వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


Online Application Link

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE