You might be interested in:
నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఛాన్స్. ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణ అవకాశం. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తం గా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులు ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.
Job Notifications Whatsapp Channel
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్డ్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 83
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా ఉద్యోగాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీస్): 13 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్): 66 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫిషియల్ ల్యాంగ్వేజ్): 04 పోస్టులు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 17
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 18
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకు జీతం ఉంటుంది.
Job Notifications Telegram Channel
వయస్సు: 2025 మార్చి 18 నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు రుసుము: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్:https://www.aai.aero/
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకు జీతం ఉంటుంది.
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 83
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 17
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 18
The post AAI Recruitment: గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే జీతం అక్షరాల రూ.1,40,000
0 comment