You might be interested in:
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఆరోగ్య భీమా పథకం...
ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్‌లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్‌లో మంత్రి వెల్లడించారు.
ఉచిత విద్యుత్
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించేలా బడ్జెట్‌లో ప్రస్తావించారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడించారు.
మత్స్యకారుల కోసం...
చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం 2.0 కింద నిధుల కేటాయింపు కేటాయించనున్నారు. అలాగే ఆదరణ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది
0 comment