AP Govt Schemes: ఏపీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీమ్స్.. అధికారికంగా ప్రకటించిన లోకేష్ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP Govt Schemes: ఏపీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీమ్స్.. అధికారికంగా ప్రకటించిన లోకేష్

You might be interested in:

Sponsored Links

AP Govt Schemes: ఏపీ ప్రజలకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏకంగా రెండు పథకాలను అమలు చేసే విషయంపై నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించడం విశేషం.

ఎప్పుడెప్పుడా అంటూ ఏపీ ప్రజలు సూపర్ సిక్స్ పథకాల కోసం ఎదురుచూపులు చూస్తున్న సమయంలో, నారా లోకేష్ చేసిన ప్రకటన పెద్ద ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో లోకేష్ ప్రకటనతో ఆ విమర్శలకు పుల్ స్టాప్ పడినట్లే.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే హామీని గుప్పించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీపం పథకం 2.o మినహాయించి మరే పథకం ప్రారంభం కాకపోవడంతో ప్రజలు సైతం ప్రభుత్వ ప్రకటనల కోసం ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏర్పడిన ఉంటేనే వరదలు రావడంతో, ప్రభుత్వ నష్టపోయిన రైతులను ఆదుకుంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, గుంతలు లేని రాష్ట్రంగా గుర్తించబడేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

ఓ దశలో సీఎం చంద్రబాబు సైతం గత ప్రభుత్వం చేసిన అరాచకంతో ప్రజలకు త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అందించలేక పోతున్నామని నిట్టూర్చారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ సైతం ఇచ్చారు. ఇటువంటి సమయంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ లు సూపర్ సిక్స్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే ప్రయత్నాలకు పూనుకున్నాయి. అందుకే శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ సూపర్ సిక్స్ పథకాలపై మంగళవారం కీలక ప్రకటన చేశారు.


తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు అందించనున్నట్లు, అలాగే రైతన్నలకు అండగా నిలిచేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి ఏడాదికి రూ. 20 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ లోకేష్ ప్రకటించారు. ఈ రెండు పథకాలను ఏప్రిల్, మే నెలలో ప్రారంభిస్తామని, అర్హత గల ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనం చేకూరుస్తామన్నారు. ఓ వైపు అభివృద్ది, మరోవైపు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.

గత ప్రభుత్వం పింఛన్ నగదు పెంపుపై దోబూచులాడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మేరకు పింఛన్ నగదును పెంచిందని లోకేష్ శాసనమండలిలో తెలిపారు. మొత్తం మీద ఏప్రిల్, మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు రాష్ట్రంలో అమలు కానున్నట్లు లోకేష్ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. సూపర్ సిక్స్ లో ఈ పథకాలు అమలైతే, మూడు పథకాలు అమలులోకి వచ్చినట్లుగా భావించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం ప్రారంభం కానుండగా, ఆ సమయంలో పథకం అమలు కావడమే మంచిదిగా ప్రజలు భావిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ప్రారంభం కానున్నట్లు లోకేష్ చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE