You might be interested in:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ త్వరలోనే అమలు కానున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి రూ.15,000, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20,000 అందజేయనున్నట్లు ఆయన శాసనమండలిలో ప్రకటించారు.
ఈ పథకాలను ఏప్రిల్, మే నెలల్లో లబ్ధిదారులకు అందజేయడం ఖాయం అని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామన్నారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ లక్ష్యమని, ఎలాంటి ఆలస్యం లేకుండా సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు లోకేష్ తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాలను నిర్ధిష్ట సమయానికి అమలు
గత ప్రభుత్వం పెన్షన్ సక్రమంగా పెంచకుండా, ఏడాదికి కేవలం రూ.250 చొప్పున పెంచడం దురదృష్టకరమని లోకేష్ విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను నిర్ధిష్ట సమయానికి అమలు చేసి, ప్రజలకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ పేర్కొన్నారు.
0 comment