You might be interested in:
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను పొందే ఛాన్స్ వచ్చింది.
ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను PGDBF కోర్సు ద్వారా భర్తీ చేస్తుంది. దరఖాస్తుదారులు ఒక సంవత్సరం పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (PGDBF) కోర్సును అభ్యసించి ఉండాలి. ఈ కోర్సులో ఆరు నెలల క్యాంపస్ తరగతులు ఉంటాయి. IDBI బ్యాంక్ శాఖలు/కార్యాలయాలు/కేంద్రాలలో 2 నెలల ఇంటర్న్‌షిప్, 4 నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ (OJT) ఉంటుంది. దరఖాస్తుదారులు కోర్సు ఫీజు రూ. 3 లక్షలు చెల్లించాలి.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
IDBI బ్యాంక్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో శిక్షణ అందించడానికి IDBI బ్యాంక్, బెంగళూరులోని U-Next మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (UMGES), గ్రేటర్ నోయిడాలోని నిట్టే ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (NEIPL)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC లకు మూడేళ్లు, SC/ST లకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 6న జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ. 1050 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ. 250 చెల్లించాలి.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు PGDBF డిప్లొమా ప్రదానం చేస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు IDBI బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ 'O')గా నియమితులవుతారు. కోర్సులో ఆరు నెలల శిక్షణ సమయంలో, నెలకు రూ. 5000 అందిస్తారు. ఇంటర్న్‌షిప్ ద్వారా మీకు నెలకు రూ. 15,000 జీతం లభిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికైన తర్వాత ఏడాదికి రూ. 6.14 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు జీతం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 12 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
0 comment