You might be interested in:
India Post GDS Recruitment 2025 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో 519 జీడీఎస్ పోస్టులు ఉన్నాయి. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాలి. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మార్చి 3వ తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో 1215 ఖాళీలు ఉన్నాయి
Job Notifications Whatsapp Group
India Post జీడీఎస్ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పని చేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం ఉంటుంది. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజు వారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే. అలాగే.. అప్లయ్ చేసుకోవడానికి అప్లికేషన్ లింక్
Job Notifications Telegram Group
ఇతర ముఖ్యమైన సమాచారం:
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 18- 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్‌లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయనే విషయాన్ని గమనించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10, 2025
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
దరఖాస్తు సవరణలకు అవకాశం: మార్చి 6 నుంచి 8 వరకు.
India Post GDS ఎంపిక విధానం:
10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థుల నియామకం ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2.. ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది.
Subscribe Job Notifications YouTube Channel
0 comment