You might be interested in:
IOCL jobs: టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఆయల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో మార్కెటింగ్ డివిజన్ పలు ప్రదేశాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 23వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా జూనియర్ ఆపరేటర్ గ్రేడ్, జూనియర్ అటెండెంట్ గ్రేడ్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 246
ఇందులో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1, జూనియర్ అటెండెంట్ గ్రేడ్-1, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వారీగా…
జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1: 215 ఉద్యోగాలు
జూనియర్ ఆటెండెంట్ గ్రేడ్-1: 23 ఉద్యోగాలు
జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3: 08 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 23
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అయితే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణిలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 జనవరి 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్ గ్రేడ్-1 పోస్టులకు రూ.23,000 - రూ.78,000, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుకు రూ.25,000 - రూ.1,05,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ నోటిఫికేషన్:https://iocl.com/latest-job-opening
0 comment