You might be interested in:
Sponsored Links
జేఈఈ మెయిన్స్ చివరి విడత దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కాగా.. జనవరి 31 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి విండోను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఏ వెల్లడించింది. చివరి విడత ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య జరుగుతాయి. ఇటీవలే తొలి విడత పరీక్షలు పూర్తయ్యాయి. చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17వ తేదీ నాటికి ర్యాంకులు ప్రకటిస్తారు.
0 comment