Navy Recruitment 2025: నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. జాబ్ వస్తే నెలకి లక్ష జీతం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Navy Recruitment 2025: నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. జాబ్ వస్తే నెలకి లక్ష జీతం

You might be interested in:

Sponsored Links

Navy Recruitment 2025: భారతీయ నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) విధానంలో 270 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ అర్హతలున్నవారు అర్హులు. ఇంటర్వ్యూతోనే నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎంపికైన వారు శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి ప్రవేశిస్తారు. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.

Job Notifications Whatsapp Group

నోటిఫికేషన్ వివరాలు:

ఈ ఎడక్నికల్ బ్రాంచ్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ లెవల్-10 గ్రేడ్‌లోని ఉద్యోగాలే. పరీక్ష లేకుండా ఎంపిక చేసే విధానం ఈ పోస్టుల ప్రత్యేకత. దరఖాస్తుదారులను వారి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి, బీఈ/బీటెక్ లేదా పీజీలో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి.

ఎంపిక విధానం:

ఇంటర్వ్యూ: దరఖాస్తుదారుల నుంచి ప్రతిభ ఆధారంగా కొన్ని వేల మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: ఈ ఇంటర్వ్యూలు బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

వైద్య పరీక్షలు: ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకం ఖరారు చేస్తారు.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు జనవరి 2026 నుంచి 22 వారాలపాటు నేవల్ అకాడమీ, ఎజిమాలలో శిక్షణ ఇస్తారు. అనంతరం మరో 22 వారాలు సంబంధిత విభాగ కేంద్రంలో శిక్షణ కొనసాగుతుంది.

వేతనం మరియు ప్రోత్సాహకాలు:

మూల వేతనం: రూ.56,100 

అదనపు ప్రయోజనాలు: డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు

మొత్తం జీతం: మొదటి నెల నుంచే రూ.1,10,000 వరకు పొందవచ్చు

ఉద్యోగ వ్యవధి:

ఈ పోస్టులు పరిమిత కాల ప్రాతిపదికన (Short Service Commission - SSC) భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు గరిష్టంగా 12 సంవత్సరాలపాటు పనిచేయవచ్చు. అదనంగా మరో 2 సంవత్సరాలు పొడిగింపు అవకాశం ఉంటుంది, అంటే గరిష్టంగా 14 ఏళ్ల వరకు పనిచేయవచ్చు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది. నౌకాదళ అనుభవంతో అభ్యర్థులు సివిల్ రంగ ఉద్యోగాల్లో సులభంగా అవకాశాలు పొందగలరు.

ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:

జనరల్ సర్వీస్ - 60

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 18

నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ - 22

పైలట్ - 26

లాజిస్టిక్స్ - 28

ఎడ్యుకేషన్ బ్రాంచ్:

మొత్తం - 15

టెక్నికల్ బ్రాంచ్:

ఇంజినీరింగ్ - 38

ఎలక్ట్రికల్ - 45

నేవల్ కన్‌స్ట్రక్టర్ - 18

Job Notifications Telegram Grouo

అర్హతలు:

విద్యార్హత: సంబంధిత విభాగంలో 60% మార్కులతో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ లేదా ఎంసీఏ పూర్తిచేసినవారు అర్హులు.

వయసు: పోస్టు ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌సీసీ 'C' సర్టిఫికేట్: ఉంటే అకడమిక్ మార్కుల్లో 5% సడలింపు ఉంటుంది.

చదువు చివరి ఏడాది విద్యార్థులు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ:


ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2025


అధికారిక వెబ్‌సైట్:www.joinindiannavy.gov.in

Download Complete Notification

Job Notifications You Tube Channel

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE