You might be interested in:
నిరుద్యోగులకు ఇంత మంచి అవకాశం మళ్లీరాదు. సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. నేషనల్ హైవేస్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Notifications Whatsapp Group
ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే దరఖాస్తకు ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది.
ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్ విధానంలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
కేటగిరీ వారీగా ఉద్యోగాలు:
యూఆర్-26, ఎస్సీ-9, ఎస్టీ-4, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 8 ఉద్యోగాలున్నాయి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరయన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.)
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్(2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 24 లోగా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలి.
పూర్తి వివరాలను ఆఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్:https://nhai.gov.in
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే భారీ వేతనం కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ.56,100 ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల జీతం రూ.1,77,500 అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ లో ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
Job Notifications Telegram Group
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 నుంచి రూ.1,77,500 వేతనం ఉంటుంది.
ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం: గేట్ స్కోర్(2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
0 comment