You might be interested in:
నాలుగు సంవత్సరాల 'ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్'లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. 'నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025' పేరిట జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది..
ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యా సంస్థల్లోని 6,100 సీట్లలో అడ్మిషన్లు పొందవచ్చు. పరీక్షల్లో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సులో సీట్లను భర్తీ చేస్తాయి. ఇంటర్ విద్యార్హత ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి వయోపరిమితి లేదు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలను అడుగుతారు. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీతోపాటు 13 భాషల్లో జరుగుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16
పరీక్ష తేదీ: ఏప్రిల్ 29
నూతన విద్యావిధానం-2020కు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో యోగా, వ్యాయమ విద్య, ఆర్ట్స్, సంస్కృతం ప్రవేశపెట్టనున్నారు. ఇవి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏ కోర్సులోనైనా విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధన ఉండేది. ఇక దీనిని 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80 శాతానికి పెంచనున్నారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ పూర్తి వివరాలకు exams.nta.ac.in/NCET/ వెబ్‌సైట్ చూడవచ్చు.
0 comment