You might be interested in:
Sponsored Links
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. ఒకటో తరగతి నుంచి 12 తరగతుల వరకు పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ఇక నుంచి స్కూళ్లు ఉదయం 6.30 నుంచి 10.30 వరకు మాత్రమే ఉంటాయని వెల్లడించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలోనే మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. వేసవి ముగిసేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా పిల్లలకు నీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఈ నిర్ణయం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.
0 comment