You might be interested in:
Agniveer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలు చేపడతామని భారత సైన్యం ప్రకటించింది. 21 ఏళ్లలోపు.. అవివాహితులైన యువత దేశ సైనికులుగా ఎంపికయ్యేందుకు అర్హులు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష
మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 భారతీయ భాషల్లో అగ్నివీర్ నియామక పరీక్ష నిర్వహించబోతున్నారు. అదనంగా 1.6 కిలోమీటర్ల పరుగు సమయాన్ని 6 నిమిషాలు 15 సెకన్లకు పెంచారు. అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రతిభావంతులైన క్రీడాకారులు, అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటీఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇవ్వబడతాయి.
పోస్టులు:
అగ్నివీర్ జనరల్ డ్యూటీ
అగ్నివీర్ టెక్నికల్ అధికారి
అగ్నివీర్ కార్యాలయ సహాయకులు
స్టోర్ కీపర్ టెక్నికల్
అగ్నివీర్ వృత్తి నిపుణులు
ఎవరు అర్హులు:
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం:
మొదటి ప్రక్రియ: joinindianarmy.nic.in. అనే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
రెండో స్టెప్: కిందకు స్కోల్ చేయగా అగ్నివీర్ అప్లై/ లాగిన్ అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి.
మూడో స్టెప్: కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటే మీ పేరుపై అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాతవారే అయితే మీ లాగిన్ డిటైల్స్ పొందుపర్చి లాగిన్ అవ్వాలి.
నాలుగో స్టెప్: అక్కడ అడిగిన వివరాలన్నీ నమోదు చేసి పేమెంట్ చేయాలి. అనంతరం సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు పూర్తయిపోతుంది.
ఐదో స్టెప్: సబ్మిట్ చేశాక దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తదుపరి ప్రక్రియ కోసం దరఖాస్తు పత్రం చాలా అవసరం.
0 comment