You might be interested in:
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని....విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది.
హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
మీరంతా చదువులో వెనుకబడ్డారని 'మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేమ, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలుపెట్టారు. హెడ్మాస్టర్ చర్యతో మొదట అవాక్కయిన విద్యార్థులు వద్దు సార్..గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు.అయినా ఆయన మాత్రం ఆగలేదు.
0 comment