You might be interested in:
మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటన చేశారు. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందించగలుగుతున్నామని.. జూన్ నాటికి 400 సర్వీసులు అందిస్తామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఓ 200 సేవలతో మన మిత్ర యాప్ ద్వారా ఈ సేవలు కొనసాగుతూ వచ్చాయి. వాట్సాప్ ద్వారా క్షణాల్లో పౌర సేవలతో పాటు ప్రభుత్వ ధ్రువపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం.
తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ 2.0 ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా కొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు నారా లోకేష్. ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని.. ఒకచోట నుంచి మరోచోటకు టికెట్ కావాలని జస్ట్ నోటితో చెబితే.. టికెట్ బుక్ చేసేలా సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు లోకేష్. అలాగే నంబర్ చెబితే కరెంట్ బిల్లు చెల్లించేలా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
* విద్యార్థులకు గుడ్ న్యూస్
విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల సేవలు ఈసారి వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) ద్వారా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే.. వాటిని నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు పంపిస్తామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
0 comment