You might be interested in:
పుస్తకాల బరువు తగ్గింపు – సెమిస్టర్ విధానం అమలు చేస్తున్నాం మంత్రి నారా లోకేష్
విద్యార్థుల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలులోకి రానుంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోసే అవసరం లేకుండా, ఒక్కో సెమిస్టర్‌కు అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించనున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి విద్యార్థులకు ఒక్కో సెమిస్టర్‌కు కేవలం రెండు పుస్తకాలే ఉంటాయి. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వారికి పాఠాలను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ పెరుగుతుందని, మరింత ఆసక్తితో చదవగలుగుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు అందించే సెమిస్టర్ పుస్తకాలను గౌరవిద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులకు చూపించారు వాటి మీద వారి విలువైన సూచనలు ఆహ్వానించారు
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment