You might be interested in:
నేడు విజయవాడ నందు CSE గారు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కమిషనర్ విజయరామరాజు గారు వర్చువల్ గా చర్చించడం జరిగింది. ఈ సమావశం లో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్స్ అబ్రహం,శైలజ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు:
🚩 మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేయడం గురించి ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా మాట్లాడి తీసుకోవడం జరిగిందని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నిర్ణయం మేరకే మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
🚩 సీనియారిటీ లిస్టులు చాలావరకు అన్ని జిల్లాలలో తప్పులుగా ఉన్నాయని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా సాయంత్రం అందరూ డీఈవో లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సరి చేయిస్తామన్నారు.
🚩 ఏజెన్సీ ఏరియాలలో పనిచేసే టీచర్లకు ప్రత్యేకంగా వారు పనిచేసిన కాలానికి సంవత్సరానికి ఒక పాయింట్ అదనంగా కేటాయిస్తామని తెలిపారు.
🚩 గతంలో గవర్నమెంట్ జీవోల ద్వారా బదిలీ అయిన వారికి గతంలో పని చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో కలిపి లాంగ్ స్టాండింగ్ తీసుకోవడం జరగదని తెలిపారు. గవర్నమెంట్ జీవోల ద్వారా బదిలీ అయిన వారికి రెండు స్టేషన్లను కలిపి లాంగ్ స్టాండింగ్ తీసుకోవడం బదిలీల యాక్ట్ అమలు నుంచి అమలు చేస్తామన్నారు.
🚩 స్పెషల్ ఎడ్యుకేషన్, క్రాప్ట్, డ్రాయింగ్, మ్యూజిక్, ఒకేషనల్ టీచర్లకు కూడా సాధారణ టీచర్ల మాదిరిగానే బదిలీలు నిర్వహిస్తామని తెలిపారు.
🚩 సర్వీస్ పాయింట్ లో 0.5 నుంచి ఒకటికి పెంచడంపై ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయని, సర్వీస్ పాయింట్ లు ఒకటి ఇవ్వాలా, 0.5 ఇవ్వాలా అనే విషయమై కమీషనర్ గారు అన్ని యూనియన్ల అభిప్రాయాలు కోరడం జరిగింది.సంఘ పక్షాన ప్రస్తుత క్యాడర్ కు 1 పాయింట్, ఫీడర్ కేడర్ కు 0.5 కోరడం జరిగింది. తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
🚩Widows ను ప్రిఫరెన్షియల్ కేటగిరి గా పరిగణించే విషయం పునరాలోచిస్తున్నామన్నారు.Widower కు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది.
🚩 ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ విషయం కూడా GAD సూచించిన విధంగా పెడితే న్యాయపరమైన వివాదాలు ఉండవని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
🚩 సాధారణ బదిలీలతో కాకుండా అంతర్ జిల్లా బదిలీలు ప్రత్యేకంగా చేపడుతారు.
🚩 రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయునులు ప్రత్యేక సెలవు ఉపయోగించుకోవచ్చు.
0 comment