You might be interested in:
*గ్రూప్-2 అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోండి
▪️ *హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ వివరణ
గ్రూప్-2 (2023 నోటిఫికేషన్) అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టు, జోనల్/జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. వీటి నమోదుకు మంగళవారం నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు తెలిపింది. గత నెలాఖరులో గ్రూప్-2 ప్రధాన పరీక్ష నిర్వ హించారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరి కింద కేటాయించిన పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైని కులు, క్రీడాకారుల్లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే.. ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళనలు చేశారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
▪️హారిజాంటల్ రిజర్వేషన్ కింద అర్హులైన మహిళా అభ్యర్థులు లేకుంటే.. ఆ పోస్టులను ప్రతిభ కలిగిన మహిళా అభ్యర్థులతో భర్తీ చేస్తాం. ఒకవేళ వారు కూడా లేకుంటే అర్హత కలిగిన పురుష అభ్యర్థులతో భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటాం.
▪️ఇందుకు తగ్గట్లు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడ బ్ల్యూఎస్/జనరల్ వివరాలతో ఐచ్ఛికాలు ఇచ్చేందుకు వెబ్సైట్లో అవకా శాన్ని కల్పించాం. జనరల్ కేటగిరి పోస్టుల ఖాళీల భర్తీకి అభ్యర్థులందరూ ఐచ్ఛికాలు ఇవ్వొచ్చు
0 comment