Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు - Jnanaloka

Latest G.O s

Program

home full ad 2

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now
Sponsored Links

 Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టుల భర్తీకి మార్చి 29 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీటీ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


వివరాలు..


* అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, స్త్రీలు 157 సెం.మీ. ఉండాలి.


వయోపరిమితి:

అగ్నివీర్ 02/2025 బ్యాచ్‌: అభ్యర్థులు 01.09.2004 - 29.02.2008 మధ్య జన్మించి ఉండాలి.

అగ్నివీర్ 01/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.02.2005- 31.07.2008 మధ్య జన్మించి ఉండాలి.

అగ్నివీర్ 02/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.07.2005- 31.12.2008 మధ్య జన్మించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు:రూ.550.


దరఖాస్తు విధానం:అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

You might be interested in:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.


శిక్షణ వివరాలు:అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 02/2025 బ్యాచ్‌కు-సెప్టెంబర్‌, 01/2026 బ్యాచ్‌కు- ఫిబ్రవరి అండ్ 02/2026 బ్యాచ్‌కు-జులై నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


జీత భత్యాలు:ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.


ముఖ్యమైన తేదీలు..


⏩ స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 CBT)


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.04.2025.


➥ ఫీజు చెల్లింపు తేదీలు: 29.03.2025.- 10.04.2025.


➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.04.2025. - 16.04.2025.


➥ స్టేజ్-1 (INET): మే 25.


➥ స్టేజ్ I(INET) ఫలితాల ప్రకటన: మే 25.


⏩ స్టేజ్ 2- అగ్నివీర్ 02/2025


➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: జూన్ 25.


➥ స్టేజ్ 2- ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 02/2025: జులై 25.


➥ శిక్షణ ప్రారంభం: సెప్టెంబర్ 25.


⏩ స్టేజ్ 2- అగ్నివీర్ 01/2026


➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: అక్టోబర్ 25.


➥ స్టేజ్ 2- ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 01/2026: నవంబర్/ డిసెంబర్ 25.


➥ శిక్షణ ప్రారంభం: ఫిబ్రవరి 26.


⏩ స్టేజ్ 2- అగ్నివీర్ 02/2026


➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: మే 26.


➥ స్టేజ్ 2- ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 02/2026: మే 26.


➥ శిక్షణ ప్రారంభం: జులై 26.


Official Website

Download Complete Notification

0 comment

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE