LIC Scheme : ఎల్ఐసీలో అదిరే స్కీమ్.. రోజుకు కేవలం రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు మీ సొంతం..! - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

LIC Scheme : ఎల్ఐసీలో అదిరే స్కీమ్.. రోజుకు కేవలం రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు మీ సొంతం..!

You might be interested in:

Sponsored Links

 LIC Scheme : ప్రస్తుతం మార్కెట్లో అనేక పెట్టుబడి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆప్షన్లకు కొరత లేదు.

ఎల్‌ఐసీ అద్భుతమైన పథకాన్ని కలిగి ఉంది. ఇందులో మీరు రోజూ చిన్న మొత్తాలను డిపాజిట్ చేయొచ్చు.



తద్వారా భారీగా డబ్బులను కూడబెట్టుకోవచ్చు. ఈ డబ్బులను పిల్లల విద్య కోసం పెళ్లి లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పనులకు ఉపయోగించవచ్చు. ఈ పథకం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

ఎల్ఐసీ స్కీమ్ పేరు జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో మీరు రోజుకు రూ.200 కన్నా తక్కువ డిపాజిట్ చేయొచ్చు. తద్వారా రూ.20 లక్షలను కూడబెట్టవచ్చు. ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే అంతే స్థాయిలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ. 1 లక్షగా ఉంది. గరిష్ట పరిమితి అంటూ ఏది లేదు.

మీరు ఎంత పరిమాణంలోనైనా డబ్బును కూడబెట్టవచ్చు. ఈ పథకంలో వయస్సు, కాలపరిమితి చాలా ముఖ్యం. ప్రస్తుతం మీకు 21 ఏళ్లు అనుకుంటే.. రూ. 20 లక్షలు కూడబెట్టడానికి మీరు 30 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5,922 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రోజుకు దాదాపు రూ. 197 అనమాట. ఈ ప్రీమియం మొదటి ఏడాదికి వర్తిస్తుంది. రెండో ఏడాది నుంచి ప్రతి నెలా రూ. 5,795 అంటే.. దాదాపు రూ. 193 ప్రీమియం చెల్లించాలి.

ఎల్ఐసీ టర్మ్ మెచ్యూరిటీ ప్లాన్ ఇదే :

ఎల్ఐసీ టర్మ్ మెచ్యూరిటీ ప్లాన్ తీసుకునే వాళ్లు ముందుగా ఈ పథకాన్ని ఎన్ని ఏళ్లు పెట్టుకుంటున్నారో తెలుసుకోవాలి. దానికి తగినంత ప్రీమియం కూడా చెల్లించాలి. 30 ఏళ్ల ప్లాన్ విషయానికి వస్తే.. ఈ కాల వ్యవధిలో పాలసీదారుడు ప్రీమియం చెల్లించాలి. పాలసీదారు మరణిస్తే.. నామినీకి ప్రాథమిక హామీ మొత్తంలో 125 శాతం లేదా మరణం వరకు చెల్లించిన ప్రీమియంలో 105 శాతం రాబడి లభిస్తుంది.

ఎల్ఐసీ పథకం ప్రయోజనాలేంటి? :

ఈ ఎల్ఐసీ పథకంలో బోనస్ కూడా ఉంది. 30 ఏళ్ల పాటు రోజుకు రూ.200 డిపాజిట్ చేస్తే సరి. దాదాపు రూ.30 లక్షల బోనస్ పొందవచ్చు. మరింత సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంజ్ దగ్గరకు వెళ్లండి. ఈ పాలసీపై లోన్ కూడా పొందవచ్చు.

ఎవరెవరూ తీసుకోవచ్చుంటే? :

18 ఏళ్ల వయస్సు నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న ఎవరైనా ఈ ఎల్ఐసీ పాలసీని తీసుకోవచ్చు. ఈ ఎల్ఐసీ పాలసీ కాల వ్యవధి 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE