You might be interested in:
SBI Recruitment: ఎస్బీఐలో రిటైర్డ్ స్టాఫ్ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 1194 కాంకరెంట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 15న దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ లోగా అభ్యర్థులు ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1194
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంకరెంట్ ఆడిటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీలు రాష్ట్రాల వారీగా..
ఆహ్మాదాబాద్: 124 పోస్టులు
అమరావతి: 77 పోస్టులు
బెంగళూరు: 49 పోస్టులు
భువనేశ్వర్: 50 పోస్టులు
భోపాల్: 70 పోస్టులు
చండీగఢ్: 96 పోస్టులు
చెన్నై: 88 పోస్టులు
గౌహతి: 66 పోస్టుల
హైదరాబాద్: 79 పోస్టులు
జైపూర్: 56 పోస్టులు
కోల్ కత్తా: 63 పోస్టులు
లక్నో: 99 పోస్టులు
మహారాష్ట్ర: 91 పోస్టులు
ముంబై మెట్రో: 16 పోస్టులు
న్యూఢిల్లీ: 68 పోస్టులు
పాట్నా 50 పోస్టులు
తిరువనంతపురం: 52 పోస్టులు
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 18
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 15
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లు మించరాదు.
అర్హత: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకుని ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అధికారి 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ పొందిన తరువాత మాత్రమే బ్యాంక్ సర్వీస్ నుండి రిటైర్ అయి ఉండాలి.
*స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన, సస్పెండ్ చేసిన లేదా పదవీ విరమణకు ముందే బ్యాంకును విడిచిపెట్టిన అధికారులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోరాదు. పదవీ విరమణ చేసిన ఎంఎంజీఎస్-3, ఎస్ఎంజీఎస్-4/వీ, టీఈజీఎస్-6గా పదవీ విరమణ చేసిన ఎస్బీఐ, దాని ఈ-అసోసియేట్ బ్యాంకుల అధికారులను మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ముందుగా అప్లికేషన్ లను పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగంలో సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ సేమ్ మార్కులు వస్తే.. డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు. వయస్సులో ఎవరు పెద్దవారు అయితే వారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు రూ.45,000 నుంచి రూ.80,000 వరకు జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
0 comment