Women's Day 2025 : రేపు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Women's Day 2025 : రేపు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం

You might be interested in:

Sponsored Links

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Women’s Day 2025) పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది.

మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచే దిశగా 1000 ఈ-బైక్లు, ఆటోలు ( E-Bikes and E-Autos) అందించే ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనుంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆసక్తి కలిగిన డ్వాక్రా మహిళలకు ఈ వాహనాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. మహిళలు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి.



ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వాహనాలను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ-బైక్లు, ఆటోలు పొందిన మహిళలు వాహనాలను వాడుతూ తమ జీవనోపాధిని మెరుగుపర్చుకునేలా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తోంది. ప్రత్యేకించి, ట్రాన్స్‌పోర్ట్ రంగంలో మహిళల పాత్రను పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

అయితే ఈ వాహనాలను అద్దెకు నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడో సంస్థతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. దీనివల్ల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం లభించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళలు తమ సొంత వాహనాలను నడిపి, రైడ్-షేరింగ్ సేవల్లో భాగస్వామ్యం అవ్వవచ్చు. ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, రవాణా రంగంలో మహిళల హస్తక్షేపాన్ని పెంచేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. ఈ విధానం మహిళలకు ఆర్థికంగా స్వతంత్రతను అందించడంతో పాటు, రాష్ట్రంలో ఓ కొత్త ట్రెండ్‌కు నాంది కానుంది. భవిష్యత్తులో మరిన్ని మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, రవాణా రంగంలో పురుషులతో సమానంగా ముందుకు సాగేలా ప్రభుత్వ ప్రోత్సాహం అందించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకున్న ఈ నిర్ణయం, మహిళా సాధికారితలో మరో మైలురాయి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE