ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు సమావేశంలో చర్చించిన అంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు సమావేశంలో చర్చించిన అంశాలు

You might be interested in:

Sponsored Links

 మిత్రులారా!

 ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు సమావేశం ఏర్పాటు చేశారు

 ఈ సమావేశంలో

** సీనియార్టీ లిస్టులు పై చర్చ జరిగింది .సీనియారిటీ లిస్టులో అన్ని పొరపాట్లను కంప్లీట్ చేసి 15 నాటికి డిస్ప్లే చేస్తామని, దాని తర్వాత మరల అభ్యంతరాలు తీసుకుంటామని 20వ తేదీన ఫైనల్ లిస్టు ప్రకటిస్తామని తెలిపారు.

 అయితే పొరపాట్లను డిఈవోల వద్దే సరిచేసుకోమని చెప్పడం సరికాదని ,మరల డిడిఓల వద్ద సరిచేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరాము.

 దీని పరిశీలిస్తామన్నారు.


**ప్రమోషన్ కు సంబంధించి  ప్రధానోపాధ్యాయుల బదిలీలు ,ప్రమోషన్స్   తరువాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, ఎస్ జి టి ల ప్రమోషన్స్, బదిలీల ప్రక్రియ చేపడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎస్ జి టి ల క్రాఫ్ట్, డ్రాయింగ్ వారికి మాన్యువల్ కౌన్సిలింగ్ కచ్చితంగా నిర్వహించాలని తెలియజేశాము.


 --ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభమవుతుందనేది సూచనప్రాయంగా తెలియజేశారు.


** ఏప్రిల్ 25, 26,27 తేదీల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ బోర్డు  వద్ద మెడికల్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారు అందరూ సర్టిఫికేట్ తీసుకోవాలని  చెప్పారు.



 **జీవో 117 సంబంధించి కింద  ఉపాధ్యాయులను రకరకాల గందరగోళానికి అధికారులు గురిచేస్తున్నారని,  ఇది కమిషనర్ గారు కార్యాలయం నుంచే ఉత్తర్వులు వస్తున్నాయి అని చర్చ నడుస్తోంది.

 దీనివల్ల ప్రభుత్వం పాఠశాలలు మరింత బలహీనపడే అవకాశం ఉన్నాయని ,మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తూనే మిగిలిన పాఠశాలలను యధాతధంగా కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనికోరాము. పాఠశాల కమిటీ తీర్మానాల పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం కూడా తగదని  తెలిపాము.


-- ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి చేయమని,   అధికారులకు తగు  సూచనలు చేస్తామని తెలిపారు.


**మిగిలిన స్కూల్ అసిస్టెంట్లను పిఎస్ హెచ్ఎమ్స్ గా పంపించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

-- ఇది సరికాదు ఉన్నత పాఠశాలలోనూ లేదా ప్రాథమికోన్నత పాఠశాలలో వీరందరినీ అడ్జస్ట్ చేయాలని చెప్పాము.


** LEAP  యాప్ ని ఏప్రిల్ 15 తర్వాత ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తామని, దీనిలో ఉపాధ్యాయుల, విద్యార్థుల అటెండెన్స్ వరకు మాత్రమే ఉపాధ్యాయులు చేయాలని కోరారు.  భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్వోసీలు, వీసాలు  అన్ని అంశాలు కూడా దానిలోనే పొందుపరిచే ప్రయత్నం చేస్తామని చెప్పారు..


**  మొదటిసారి పర్మిషన్ ఇచ్చిన 294 ప్లస్ టూ పాఠశాలలను యధాతధంగా కొనసాగిస్తామని తెలిపారు. బదిలీల్లో ప్లస్ టు పాఠశాలలలో బోధిస్తున్న ఉపాధ్యాయులు అదే స్కూల్ లో ఉండదలుచుకుంటే ఉండవచ్చు లేదా వెనక్కి వచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ఖాళీలు ఏర్పడితే బదిలీలు అయిన తర్వాత ఆ ఖాళీలను పూరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


** మున్సిపల్  హై స్కూల్స్ లో ఉన్న పోస్టులన్నిటిని అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు.


** మోడల్  పాఠశాల ల బదిలీలు జీరో సర్వీస్ గా నిర్వహించాలని కోరాము.


  --తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


**  స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ అలాగే బదిలీల ప్రక్రియలో  అవకాశం కల్పించాలని కోరాము.

 -- పరిశీలిస్తామని చెప్పారు .


** ఏప్రిల్ 21 నుంచి పాఠశాలలో విద్యార్థులు చేర్చుకోవడానికి అవకాశం ఇస్తామని తెలిపారు.


** అర్హత గలిగిన ఎస్జీటీలకు పండిట్లుగా ప్రమోషన్స్ కల్పించాలని కోరాము.

-- ప్రస్తుతం జీవో 77 అభయన్స్ లో ఉంది గనుక తగు పరిశీలన చేస్తామని చెప్పారు.


** గత విద్యా శాఖ  ప్రిన్సిపల్ సెక్రెటరీ పాఠశాలల సందర్శన సందర్భంగా ఇంక్రిమెంట్స్ కోల్పోయిన ఉపాధ్యాయులకు తిరిగి ఇంక్రిమెంట్ లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరాము.

-- రెండు జిల్లాల నుంచి ఇంకా సమాచారం రావాల్సిందని, వచ్చిన వెంటనే వారందరికీ ఇంక్రిమెంట్లు కచ్చితంగా పునరుద్దరణ చేస్తామని తెలిపారు.


 **శ్రీకాకుళం జిల్లా డీఈవో గారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరాము.

--తగు ప్రాసెస్ చేస్తామని తెలిపారు.

** 2002లో గుంటూరు జిల్లాలో జరిగిన ప్రమోషన్స్ వల్ల నష్టపోయిన 62 మంది ఉపాధ్యాయులకు నోషనల్ సీనియార్టీని ఇవ్వాలని కోరాము.

-- తగిన ప్రాసెస్ చేస్తామని చెప్పారు.

** బదిలీలలో స్పెషల్ పాయింట్స్ వివిధ కేటగిరీల సంబంధించిన పాయింట్స్ రేషనలైజేషన్ కు సంబంధించిన పాయింట్స్ పై మరో నెక్స్ట్ సమావేశంలో ఫైనల్ చేస్తామని తెలియజేశారు

బదిలీల చట్టంలో ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే వాటిపై స్థానికంగా ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారికి, తదుపరి ఆర్ జె డి గారికి, ఆ తదుపరి కమిషనర్ గారికి అప్లై చేసుకోవాలని తరువాత మాత్రమే కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందనేది గమనించాలని తెలిపారు.

** 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 20 లేదా 23వ తేదీ విడుదల చేస్తున్నామని తెలిపారు.

యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE