You might be interested in:
Sponsored Links
అంతర జిల్లా బదిలీలు,కారుణ్య నియామకాలు,తరగతుల విలీనం, ఇతర సమస్యలపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారిని కలసి ప్రాతినిధ్యం చేసిన ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, యస్.చిరంజీవి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు బి.సంపత్ బాబు
* 🚩 గత నాలుగు సంవత్సరాలుగా అంతర జిల్లా బదిలీలు జరగనందున ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున ఈ అకడమిక్ సంవత్సరంలోనే అంతర జిల్లా బదిలీలు జరపాలని కోరగా విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ గారు అంగీకరించారు.
* 🚩 కరోనా సందర్భంలో మరియు ఆ తరువాత చనిపోయిన ఉపాధ్యాయుల మరియు ఉద్యోగుల( స్థానిక సంస్థల) వారసులకు కారుణ్య నియామకాలు వన్ టైమ్ పద్దతిలో ఇచ్చి సదరు కుటుంబాలను ఆదుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గారిని కోరగా నావంతుగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు
🚩 జి.హృదయరాజు/యస్.చిరంజీవి
0 comment