You might be interested in:
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కూల్ రిస్ట్రక్చరింగ్ (Re-Structuring of Schools) ప్రకారం పాఠశాలల రివైజ్డ్ కేడర్ స్ట్రెంగ్త్‌ను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. సంబంధిత మండల విద్యాధికారులు (MEOలు) తమ మండల పరిధిలోని ప్రతి పాఠశాల రివైజ్డ్ కేడర్ స్ట్రెంగ్త్‌ను సమగ్రంగా పరిశీలించి, ఏవైనా మార్పులు ఉన్నచో సకాలంలో సరిచూడగలరు.
రేపటి లోగా సంబంధిత సమాచారం స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం (CSE) వెబ్‌సైట్‌లో ధృవీకరించవలసినట్లు సూచించారు. MEO లు ధృవీకరించిన డేటా ఆధారంగా మే నెలలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి మండల విద్యాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తనిఖీ ప్రక్రియను బాధ్యతగా పూర్తిచేసి, విధివిధానాలకు అనుగుణంగా ధృవీకరణ నెరవేర్చాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నిర్ణీత గడువులోపు ధృవీకరణ పూర్తి చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
0 comment