You might be interested in:
జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్ 2025 (AP ECET- 2025) పరీక్షల షెడ్యూల్ ఈరోజు (మంగళవారం) విడుదలైంది. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మే 6వ తేదీన రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు (JNTU Vice Chancellor Sudarshan Rao) మాట్లాడుతూ.. ఏపీ ఈసెట్ పరీక్షలకు ఎన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మే 6వ తేదీన... ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు... అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఏపీ ఈసెట్ కోసం మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబడని వెల్లడించారు. మే 17వ తేదీన జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం జరుగనుందన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.
ᵖʰᵃⁿⁱᵏⁱʳᵃⁿ
*పరీక్ష తేదీలు ఇవే...*
ఏపీఆర్‌సెట్ పరీక్షలు- మే 2 నుంచి 5 వరకు
ఏపీ ఐసెట్- మే 7న,
ఏపీ ఈఏపీసెట్ 2025 (అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు) - మే 19, 20 తేదీల్లో
ఏపీ ఈఏపీసెట్ 2025 (ఇంజినీరింగ్ విభాగానికి) - మే 21 నుంచి 27 వరకు
లాసెట్/ పీజీఎల్‌సెట్ - మే 25న
పీజీఈసెట్ పరీక్షలు - జూన్ 5 నుంచి 7 వరకు
ఎడ్‌సెట్ పరీక్ష - జూన్ 8న
పీజీసెట్ పరీక్షలు - జూన్ 9 నుంచి 13 వరకు
0 comment