You might be interested in:
ఈ రోజు యూనియన్స్ తో జరిగిన సమావేశంలో ముఖ్యాంశాలు:
🪷 ఉపాధ్యాయ బదిలీల యాక్టు పై త్వరలోనే ఉత్తర్వులు విడుదలవుతాయి.
🪷 అన్ని జిల్లాలలో టీచర్ల సీనియార్టీ లిస్టులు విడుదల చేయడం జరిగింది.
మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీ లిస్టులు తయారీ చేయడంపై ఉన్న ఇబ్బందులపై చర్చించడం జరిగింది.
🪷 మెడికల్ బిల్లులు మంజూరు విషయంలో ఉన్న ఇబ్బందులు చర్చించడం జరిగింది.
ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అప్రూవల్ అయిన తర్వాత 24 గంటల్లోనే డిజిటల్ సైన్ తో అప్రూవ్ చేసే విధంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తారు.
🪷 మెడికల్ బిల్లుల రీ వేలిడేషన్ లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని కోరడం జరిగింది.
🪷 అన్ రికగ్నైజేడ్ హాస్పిటల్స్ బిల్లులకు సంబంధించి అన్ని బిల్లులు భౌతికంగా పంపడం కాకుండా ఆన్లైన్లోనే నిర్వహించే విధంగా చర్యలు చేసుకుంటారు.
🪷 పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లుల క్లియరెన్స్ కు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరడం జరిగింది.
🪷 లాంగ్వేజ్ పండిట్ల కు ప్రమోషన్లకు సంబంధించి ఫైల్ గవర్నమెంట్ కు పంపడం జరిగింది.
త్వరలోనే ప్రమోషన్లు చేపడతారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులలో చేర్చడం జరగదు.
🪷 అనంతపురం జిల్లాలో నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రమోషన్లు కూడా త్వరలోనే చేపడతారు.
🪷 2002 మరియు 2003 డిఎస్సీ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్లు , ప్రమోటీస్ సీనియారిటీ విషయాలలో స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది.
🪷 మెడికల్ బిల్లలు అప్లోడింగ్ లో ఉన్న టెక్నికల్ ఇబ్బందులు తొలగించుకోవడానికి ap_ drntrvaidyaseva.ap.gov.in మెయిల్ కు సంబంధిత డి డి ఓ మెయిల్ ద్వారా, సంబంధిత పత్రాలను పంపి పరిష్కరించుకోవచ్చు.
లేదా Dial 104 ద్వారా కూడా అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు.
🪷 రెండు రోజులలో CCL ఆప్షన్ ను అటెండన్స్ యాప్ లో ఇస్తారు.
0 comment